దళిత బాంధవుడు సీఎం కెసిఆర్
పాల్వంచ : దళిత బాంధవుడు సీఎం కెసీఆర్ సార్ అని,దళితుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న మహోన్నత వ్యక్తి అని కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస్ కాలనీలో 2 దళిత బంధు యూనిట్లు హర్షిత టెంట్ హౌస్, ఇందు ఇంజనీరింగ్ వర్క్స్ ను వనమా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి సీఎం కెసిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి అని వనమా అన్నారు.ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి కాపు సీతాలక్ష్మి , వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, పాల్వంచ ముంచిపల్ కమిషనర్ శ్రీకాంత్,మేనేజర్ ఎల్ వి సత్యనారాయణ, పాల్వంచ జడ్పిటిసి బరపటి వాసుదేవరావు,ఎంపిపి మడివి సరస్వతి,తెరాస పట్టణ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, మండల అధ్యక్షులు మల్లెల శ్రీరామ్మూర్తి,కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిలర్స్ సహిరా బేగం,టిఆర్ఎస్ నాయకులు భీమా శ్రీధర్,రావి రాంబాబు, యూసుబ్,పేరం నాగమణి,బి.శాంతి,కాల్వ ప్రకాష్ రావు,చింతా నాగరాజు,కందుకూరి రాము,దారా చిరంజీవి,పిల్లి కుమార్,తలుగు అశోక్,ఈశ్వర్,ఎలకా రామస్వామి తదితరులు పాల్గొన్నారు.