పేదోళ్ల ఆడపిల్లలకు పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్
* ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా
* ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు
కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీలోని ఎమ్మెల్యే వనమా వివిధ వార్డులకు సంబంధించిన కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.ఈరోజు కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కొత్తగూడెం మున్సిపాలిటీలోని వివిధ వార్డులకు సంబంధించి సుమారు 54,06428 రూపాయల 54 చెక్కులను లబ్ధిదారులకు తన చేతుల మీదుగా స్వయంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ పేదోళ్ల ఆడపిల్లలకు పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ అని, తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో అమలు కావట్లేదని, కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని ఎమ్మెల్యే వనమా తెలిపారు.
ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి,ఎంఆర్ఓ రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, కౌన్సిలర్లు కోలాపురి ధర్మరాజు, రుక్మందర్ బండారి, పరమేష్ యాదవ్, వేముల ప్రసాద్, అంబుల వేణు, బండి నరసింహా, బాలిశెట్టి సత్యభామ, కూరపాటి విజయలక్ష్మి, అజ్మీర సుజాత, మోర రూప, సుజాత, విజయ్, చారి, కంచర్ల జమలయ్య, మాచర్ల రాజకుమారి, మునిగడప పద్మ, భుఖ్య శీను, నేరెళ్ల సమైక్య, కో ఆప్షన్ సభ్యులు దూడల బుచ్చయ్య, కనుకుంట్ల పార్వతి, దుంపల అనురాధ మరియు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రజలే ప్రాణంగా బ్రతుకుతున్న ప్రజానాయకుడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం గత మూడు వందల సంవత్సరాలుగా వేంచేసి ఉన్న శ్రీనివాస్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్ట (శ్రీనివాస్ గిరి) నీ భద్రాద్రి జిల్లా చిన్న తిరుపతి గా తీర్చుదాం అనే ఆకాంక్షతో మెట్లు ఎక్కుతూ ఇబ్బంది పడుతున్న భక్తులకోసం కింద నుండి కొండపై వరకు రోడ్డు 11 కోట్ల 25 లక్షలు తో శాంక్షన్ చేపించి భద్రాద్రి జిల్లా భక్తులకి శుభవార్త అందించి అభివృద్ధి చేపడుతున్న నాయకుడు అలానే దమ్మపేట సెంటర్ నుండి శ్రీనివాస్ కాలనీ వరకు నూతన రోడ్డు నిర్మాణం కోసం కోటి 50 లక్షల శాంక్షన్ చేపించి.భద్రాద్రి జిల్లా కొత్తగూడెం అభివృద్ధి ధ్యేయంగా కనీవిని ఎరగని రీతిలో చరిత్రలో ఒకే ఒక్కడుగా అభివృద్ధి లక్ష్యంగా తుది శ్వాస వరకు ప్రజలే ప్రాణంగా బ్రతుకుతున్న ప్రజానాయకుడు కారణజన్ముడుఅభివృద్ధి ప్రదాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూర్యచంద్రుడు* ఎమ్మెల్యే వనమా గారికి అలాగే రాబోయే రోజుల్లో గుడిపాడు గుడైన శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామిని కూడా తనదైన శైలిలో అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.శ్రీ మోక్ష వెంకటేశ్వరరా స్వామి ఆలయం కమిటీ అధ్యక్షుడు అరేం ప్రశాంత్.