ప్రారంభమైన ధారూర్ జాతర
* 100 ఏండ్లు పూర్తి
* ఇండియా మెథడ్ చర్చ్ ఆధ్వర్యంలో
* సిసి కెమెరాలనిఘాలో పోలీసులు భారీ బందోబస్తు
ధారూర్ : తెలంగాణ రాష్ట్రం లోనే అతిపెద్ద క్రైస్తవ జాతర ఉత్సవాలు వికారాబాద్ జిల్లాలో మంగళవారం రోజు 15.11.2022 నుండి ప్రారంభమయ్యాయి,వికారాబాద్ జిల్లా ధారూర్ మండల కేంద్రంలో ఇండియా మెథడ్ చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాతర ఉత్సవాలను హైదరాబాద్ బిషప్ డాక్టర్ ఎంఏ డానియల్,బెంగళూరు బిషప్ ఎన్.ఎల్ కర్కారే పాల్గొని ప్రారంభించారు.ధారూర్ మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ జాతర ఉత్సవాలు ఈ సంవత్సరం తో 100 వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి.ధారూర్ లో ఐదు రోజులపాటు జరిగే ఈ జాతరను వీక్షించేందుకు రాష్ట్రం నుండే కాకుండా,తమిళనాడు,కర్ణాటక,కేరళ,మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి లక్షలాదిమంది క్రైస్తవులు ఇక్కడికి చేరుకొని సిల్వ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేయగా,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిసి కెమెరాల నిఘాలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.