ధాన్యం కొనుగోలులో అందరూ కలిసికట్టుగా పని చేయాలి
- DCMS వైస్ చైర్మన్ కొత్వాల
భద్రాద్రి కొత్తగూడెం : రైతుల శ్రేయస్సుకే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపడుతున్న దాన్యం కొనుగోలులో అధికారులు, సహకార సంఘాల అధ్యక్షులు కలిసికట్టుగా పనిచేయాలని డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.బుధవారం కొత్తగూడెం డిఆర్డిఏ కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహకార సంఘాల అధ్యక్షులు,సహకార శాఖ అధికారులు సివిల్ సప్లై,వ్యవసాయ శాఖ అధికారులు,సహకార సంఘాల సి.ఐ.ఒ లు,సెంటర్ ఇన్చార్జిలతో ధాన్యం కొనుగోలు పై సన్నహాక సమావేశం నిర్వహించారు.జిల్లా సహకార శాఖ అధికారి ఎన్.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించిన సమావేశంలో కొత్వాల మాట్లాడుతూ దళారుల బారి నుండి రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నదని,రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలి అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయనప్పటికీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ప్రతిష్టాకరంగా ధాన్యం సేకరణ చేపట్టారన్నారు. సహకార సంఘాలకు గత నాలుగు సంవత్సరాలు గా రావలసిన కమిషన్లు వెంటనే విడుదల చేసేలా అధికారులు సిఫారసు చేయాలన్నారు. రైతులు ప్రభుత్వం నిబంధనల మేరకే ధాన్యం కేంద్రానికి తీసుకురావాలన్నారు.ఈ సందర్భంగా అధ్యక్షులు DCO కు వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో డిసిఓ ఎన్.వెంకటేశ్వర్లు,డీసీఈఓ ఎన్.సుబ్బారావు,డిఎం ఎస్.త్రినాధ్ బాబు, సిసిఎస్ఓ మల్లికార్జున బాబు, వ్యవసాయ శాఖ ఏడిఏ రవి,డిసిసిబి డైరెక్టర్ నిమ్మల పుల్లారావు, కొత్తగూడెం సొసైటీ అధ్యక్షులు మండే వీర హనుమంతరావు, పిఏసిఎస్ చైర్మన్లు పాల్గొన్నారు.