తప్పుడు పట్టాలు... అక్రమంగా భూకబ్జాదారులు
భద్రాద్రి : పూసుగూడెం రెవెన్యూ సర్వే నెంబర్ 241 ప్రభుత్వ భూమి పై భూ కబ్జాదారులు అక్రమంగా తప్పుడు పట్టాలు పొంది,ప్రభుత్వాన్ని మోసం చేస్తూ అసత్య ప్రచారం చేస్తున్న పాల్వంచ నివాసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న జిల్లా ఆదివాసి జేఏసీ సంఘం నాయకులు.ములకలపల్లి మండలం పూసుగూడెం సర్వే నెంబర్ 241 విస్తీర్ణం 3426-36 కుంటల భూమి గలదు,ఒరిజినల్ సేత్వార్,మరియు ఖాస్ర పహాని ప్రకారం ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డులలో నమోదయింది,అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ భూమిగానే పరిగణించబడి ఉంది.
అట్టి భూమి 5వ షెడ్యూల్లో పేర్కొన్నట్లుగా ఏజెన్సీలో గిరిజనేతలకు భూమిపై ఎటువంటి హక్కు లేదు,అట్టి భూములను ప్రభుత్వ ఉద్యోగులైన,అబ్దుల్ రహీం ఫారెస్ట్ డిపార్ట్మెంట్,మహమ్మద్ బషీర్ అహమ్మద్ కేటీపీఎస్ ఉద్యోగాలకు 40+ ఎకరాలు ప్రభుత్వ భూమి ఎలా సంక్రమించిందో చెప్పాలి ? ఏజెన్సీలో ఉన్న ప్రభుత్వ భూమిపై ఆదివాసులకే సర్వహక్కులున్నటువంటి భూమిని,తప్పుడు బై నెంబర్లుగా మార్చి అక్రమ తప్పుడు పట్టాలు పొంది,ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు,ప్రభుత్వ భూములు పై గుడిసెలు వేసిన నిరుపేదలైన ఆదివాసులకు ఇళ్ల స్థలాలు వేసుకుంటే,అసలైన భూకబ్జాదారులు ఎవరో మీకు తెలియదా.
భూకబ్జాదారులు భద్రాచలం మొబైల్ కోర్టు నుంచి పొందిన ఆర్డర్ 241 ప్రభుత్వ భూమికి సంబంధించింది కాదు.ఈ ఆర్డర్ తో స్థానిక తహసిల్దార్ పోలీసులు కుమ్మక్కై మా ఆదివాసులపై దాడులు చేసే ప్రయత్నం.ఆ భూమి నుండి ఆదివాసులను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.అలాగే భయభ్రాంతులకు గురి చేస్తూ మా ఆదివాసి నాయకులపై అక్రమ మరియు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు.ఇట్టి సర్వే నెంబర్ 241 ప్రభుత్వ భూమి అని గౌరవ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నుంచి స్టేటస్ కో ఆర్డర్ పొంది ఉన్నాము.ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి గుడిసెలు వేసుకున్న ఆదివాసులకు క్రమబద్ధీకరించి ఇళ్లస్థలాలు కేటాయించి డబుల్ బెడ్ రూమ్ కు 5 లక్షల మంజూరు చేయాలని కోరుతున్నాము.
అలాగే ఎవరైతే తప్పుడు బై నెంబర్లతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేసిన ప్రభుత్వ ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.ఈ కార్యక్రమంలో ఊకె ముక్తేశ్వరరావు సోయం బాబురావు సోయం సత్యనారాయణ,బాడిశ బిక్షం,ఆరెం ప్రశాంత్,రజిని బాబు,కాక పృధ్వీరాజ్, కురసం రమేష్ కొండ్రు పద్మ కుంజ రవి,శ్రీరాములు,పెద్దమ్మాయి,సోయం కృష్ణ కుమార్,తదితరులు పాల్గొన్నారు