కేసీఆర్ రాజ్యంలో రారాజులుగా రైతన్నలు
* రైతు బాంధవుడు కేసీఆర్
* ప్రశాంతంగా వర్దిల్లుతున్న రైతులు
* పాల్కొన్న మంత్రులు
వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలో బుధవారం రోజు వ్యవసాయ మార్కెట్ ఆవరణలో 2.02 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, రైతులతో నిర్వహించిన భారీ బహిరంగ సభ లో పాల్గొన్నారు.మంత్రులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ,సహకార మరియు మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నూతన వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.రైతులు పండించిన ధాన్యన్ని నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.వికారాబాద్ లో అగ్రికల్చర్ కళాశాల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.రైతుల క్షేమనికి అవసమైన అన్ని సౌకర్యాలు కల్పించిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అన్నారు.వ్యవసాయ మార్కెట్ కమిటీ షాపింగ్ కాంప్లెక్స్,మరుగుదొడ్లు,కవర్ షెడ్ పనులు త్వరలో నిర్మిస్తామన్నారు.
భారీ సభలో పాల్కొన్న ప్రజలు
ఈ సంధర్బంగా కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ,సహకార మరియు మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు,జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి సునితా మహేందర్ రెడ్డి గారు, మరియు చేవెళ్ల ఎంపీ గౌరవ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గారు మరియు వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్,వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ మరియు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్,అధికారులు,స్థానిక ఎంపీపీ,మున్సిపల్ కున్సిలర్లు,మార్కెట్ కమిటీ నాయకులు ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.