తాండూరుకు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ
* జీవో 150 జారీ చేసిన ప్రభుత్వం
* రూ.25 కోట్లతో భవన నిర్మాణం
* తాండూరు రోడ్లకు మహర్దశ
* ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హర్షం
* రోడ్ల కష్టాలు తీరనున్నాయి
* ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కృషితో తాండూరు రూపురేఖల్లో పెను మార్పులు
* కాలుష్య రహిత తాండూరు దిశగా అడుగులు
తాండూరు : తాండూరుకు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ మంజూరైంది.గత సెప్టెంబర్ లో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తాండూరు పర్యటనకు వచ్చిన సమయంలో తాను చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నర్సింగ్ కాలేజీని మంజూరు చేస్తూ గురువారం జీవో 150 జారీ చేసింది. తాండూరులో నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు రూ.25 కోట్ల నిధులను సైతం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.తాండూరులో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ఏర్పాటుతో గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది.ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రత్యేక చొరవతో తాండూరు నియోజకవర్గంకు మహర్దశ రాబోతోంది.తాండూరుకు నర్సింగ్ కాలేజీని మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు.మరియు ఇందుకు సహకరించిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, జిల్లా ఇంఛార్జి మంత్రి సబితారెడ్డి,చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.
తాండూర్ పట్టణా అభివృద్ధికై పటు పడుతున్న పైలట్.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తా.తాండూరు పట్టణ కేంద్రంలో భారీకేట్ల ఏర్పాటుతో ట్రాఫిక్ సమస్యలకు చెక్ గత కొన్ని రోజుల నుంచి బరికెట్ల అడ్డంగా ఉన్న బిల్డింగ్ యాజమాని నసీర్ పటేల్ స్వయంగా ముందుకు వచ్చి కాలుష్య రహిత తాండూర్ కావడం మాకు ఎంతో సంతోషమని ఆయన అన్నారు ఎప్పటికప్పుడు గౌరవ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి గారికి ఫోన్ ద్వారా సమాచారం అందిస్తున్న తెరాస సీనియర్ నాయకులు నర్సిరెడ్డి.ప్రజల క్షేమం అడిగి తెలుసుకుంటున్నా పైలట్.