జీవన్గిలో ఆగని అక్రమా గనుల తవ్వకాలు
బషీరాబాద్ : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో అక్రమంగా గనుల తవ్వకాలు యథేచ్ఛగా నాపరాతి గనుల తవ్వకాలు పట్టించుకోని రెవెన్యూ,గనుల శాఖ అధికారులు ప్రభుత్వ ఆధీనంలోని వందలాది ఎకరాల గని భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా అధికారులు,నాయకుల అండదండలతో అక్రమార్కులు ప్రభుత్వ భూముల్లోని కోట్లాది రూపాయల విలువ చేసే నాప రాళ్లను కొల్లగొట్టి దర్జాగా దోచుకుంటున్నారు.బషీరాబాద్ మండలంలోని జీవన్గి గ్రామ శివారులో ప్రభుత్వ భూములు నాపరాతి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికైనా నాపరాతి అక్రమ తవ్వకాలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి చర్యలు చేపడితే ప్రభుత్వానికి కోట్లాది రూపాయాల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.ఈ సంఘటన పై ఆయా శాఖల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.