తాండూరు ప్రాంత అభివృద్ధికి నిధుల సునామి
- చరిత్రలో ఏకకాలంలో 134 కోట్ల నిధులను కురిపించిన ఎమ్మెల్యే
తాండూరు : గిరిజన బంజారా భవన్ ఏర్పాటుకు కోటి రూపాయలు విడుదల చేయడం పట్ల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చిత్రపటాలకు ఘనంగా క్షీరాభిషేకం నిర్వహించిన గిరిజన సోదరులు.ఈ సందర్బంగా మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ విట్టల్ నాయక్ మాట్లాడుతూ తాండూర్ ప్రాంతంలో కోటి రూపాయలతో బంజారా భవన్ నిర్మాణానికి నిధులు కేటాయించినందుకు బంజారా గిరిజన సోదరుల తరఫునప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోఎమ్మెల్యే ఆధ్వర్యంలో తాండూరు ప్రాంతంలోని గిరిజన గ్రామాలన్నీ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఆనాడు అభివృద్ధికి చెందని గిరిజన తాండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.అలాగే ప్రతి గిరిజన తండాల గ్రామపంచాయతీలకు 50 లక్షల చొప్పున నిధులను కేటాయించి తండాల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కూడా బిజెపి నాయకులు వందల కోట్ల రూపాయలు ఎరవేసినా తాండూర్ అభివృద్దే లక్ష్యంగా నాయకుల కుట్రలను కుతంత్రాలను బహిర్గతం చేశారని అన్నారు.రాబోవు ఎన్నికలలో సైతం గిరిజన గ్రామాల పంచాయతీల తండాలలో ప్రతి గిరిజన సోదరుడు కంకణ బద్ధుడై ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని మరోసారి భారీ మెజారిటీ తో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా గిరిజన నాయకులు రాములు నాయక్, భీమ్ సింగ్, వెంకట్ రామ్, జ్ఞానేశ్వర్, మిత్రూ నాయక్,మాన్యా నాయక్, నరేష్, మోహన్, రెడ్యానాయక్, లక్ష్మణ్ నాయక్, తార్య నాయక్, పరశురాం తదితరులు పాల్గొన్నారు.