బీసీ సమీకృత భవనం కొరకు మంజూరు చేస్తా పైలట్
- బీసీ సమీకృత భవనం కొరకు నిధులు కేటాయించడం అభినందనీయం
- బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో
తాండూర్ : గౌరవ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపిన బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షుడు ఈడిగ శ్రీనివాస్ గౌడ్.గత కొన్ని సంవత్సరాల నుండి బీసీ సంఘం డిమాండ్ చేస్తున్న బీసీ సమీకృత భవనం రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మరియు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గకేంద్రంలో ఏర్పాటు చేయాలని చాలాసార్లు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.అందులో భాగంగానే తాండూర్ నియోజకవర్గంలో స్థానిక గౌరవ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపి రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించడం శుభ సూచకం ఒక్క తాండూర్ లోనే కాకుండా రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మరియు 118 నియోజకవర్గాలలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని బీసీ భవనాలు ఏర్పాటు చేయాలని బీసీ సంఘం తరఫున బీసీ యువజన సంఘం రాష్ట్ర నిర్వాహక అధ్యక్షుడు ఈడిగ శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
తాండూర్ నియోజకవర్గంలో బీసీ సమీకృత భవనానికి కృషి చేసినటువంటి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారికి కలిసి బీసీ సంఘం తరఫున బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మరియు తదితర బీసీ సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలియజేస్తూ త్వరగా భూమిని కేటాయించి భవన నిర్మాణ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పానుగంటి విజయకుమార్,ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షులు నరసింహ నాయక్,రంగారెడ్డి జిల్లా యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మహేష్ యాదవ్,ఆనంద్ కుమార్ గౌడ్,బాలరాజ్,నరహరి,ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.