పోలీస్ సిబ్బందితో మాట్లాడుతున్నా జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి
బషీరాబాద్ : బషీరాబాద్ మండల కేంద్రంలో గురువారం రోజున జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి IPS బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ముందుగా పోలీస్ ల గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం పోలీస్ స్టేషన్ లో,వివిధ కేసులకు సంబంధించిన ఫైల్స్, రికార్డులు, పోలీస్ స్టేషన్ భవనం మరియు ఆవరణను పరిశీలించారు.అదేవిధంగా పోలీస్ సిబ్బందితో వారి పని తీరు గురించి మాట్లాడడం జరిగింది. పోలీస్ స్టేషన్ ఆవరణలో సిబ్బంది కోరకు ఏర్పాటు చేసిన షటిల్ కోర్ట్ ను ప్రారంబించారు.జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి IPS గారు బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పని తీరు సంతృప్తికరంగా ఉందీ అని అన్నారు.ఇట్టి కార్యక్రమములో జిల్లా SP గారితో పాటు డిఎస్పి శేఖర్ గౌడ్,రూరల్ సి.ఐ రాంబాబు,హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్.ఐ విద్యాచరణ్ రెడ్డి,అన్వేష్ రెడ్డి,పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.