పేదింటి ఆడబిడ్డలకు కేసీఆర్ అండ
- పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయని కళ్యాణ లక్ష్మి,షాధిముబారక్
- ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి,మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్లదీపనర్సింలు
తాండూర్ : సోమవారం నాడు కందనెల్లి జి.పి.ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ నందు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి,మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్లదీపనర్సింలు కల్యాణలక్ష్మీ,షాధిముబారక్ చెక్కుల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి,షాధిముబారక్ పథకాల ద్వారా నిరుపేద కుటుంబీకులు ఎంతో లబ్ది పొందుతున్నారన్నారు.ఆడబిడ్డల పెండ్లికి సీఎం కేసీఆర్ పెద్దన్నగా నిలిచి రూ.1,00,116 రూపాయిలు అందజేస్తున్నారన్నారు.ఆడపిల్లల కుటుంబానికి భారం కాకూడదని ఆడపిల్ల ఉన్న కుటుంబం పెళ్లి చేయాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో తెలిసిన వ్యక్తి కేసీఆర్.కాబట్టి కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకాలు తేవడం జరిగిందని అన్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలు కొనసాగుతయని పేర్కొన్నారు.
కేసీఆర్,పైలెట్ రోహిత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
టిఆర్ఎస్వి తాండూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ మన తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నర్సింలు పాల్కొన్నారు.హైదరాబాద్ రోడ్డులో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ కళాశాల కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు తమ కళాశాలకు కోటి యాభై లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు.ఇదే కాకుండా ఐటిఐ కళాశాలకు మూడు కోట్లు మంజూరు చేసినందుకు కూడా సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి తాండూర్ డివిజన్ ఇంచార్జ్ జిల్లాని కౌన్సిలర్లు విజయదేవి రంగారావు సంగీత ఠాకూర్ కో ఆప్షన్ సభ్యులు రాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల టిఆర్ఎస్వి వర్కింగ్ ప్రెసిడెంట్ మజర్ మరియు కమిటీ సభ్యులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.