చావనైనా చస్తాం...భూమి ఇచ్చేదిలేదు
* ఒంటిపై డీజిల్ పోసుకొని అన్నదాముల్లా ఆత్మహత్యయాతనం
* సాగుభూమిలో వైకుంఠధామం నిర్మించాలని గ్రామస్థుల నిర్ణయం
* వ్యతిరేకించినందుకు కుల బహిష్కరణ
* భాదిత కుటుంబ సభ్యులతో ఎవరు మాట్లాడని వైనం
క్రైమ్ : నిజామాబాదు జిల్లా నందిపేటు మండలం సిహెచ్ కొండూరు గ్రామంలోని అన్నదాముల భూమిలో వైకుంఠధామం నిర్మించాలంటూన గ్రామస్థుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాళ్లిద్దరూ పోలీస్ కమిషనరు కార్యాలయంలో ఆత్మహత్యకు యత్నించారు.వివరాల ప్రకారం సిహెచ్ కొండూరు గ్రామానికి చెందిన హన్మాండ్లు లింగంకు వారసత్వంగా వచ్చిన రెండేకారాల భూమి ఉంది.మూడేళ్ళ క్రితం ఈ భూమిలో వైకుంఠధామం నిర్మించాలని గ్రామస్థులు నిర్ణయించారు.అయితే 40 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న భూమిలో వైకుంఠధామం నిర్మిస్తే తమకు జీవనదారమైన సాగు భూమి లేకుండా పోతుందని గ్రామస్థుల్ని వేడుకున్నారు.
అయినప్పటికి గ్రామస్థులు కుల సంఘము సభ్యులు మూడేళ్లుగా పట్టు విడవకుండా ఒత్తిడి చేస్తుందడంతో విసిగిపోయిన హన్మాండ్లు లింగాంల్ నందిపేట్లోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి న్యాయం చేయాలనీ వేడుకున్నారు.వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చి అన్నదాములిద్దరు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యయాతనం చేశారు.అక్కడే ఉన్న పోలీసులు డీజిల్ డబ్బాను,ఆగిపేట్టెను లాకున్నారు తమను కుల బహిష్కరణ గ్రామంలో కూడా తమతో ఎవరు మాట్లాడడం లేదని భాధితులు ఆవేదన వ్యక్తన చేసారు.పక్క ఊళ్లకు వెళ్లి వ్యవసాయపనులు చేస్కుంటామని వాపోయారు.స్పందించిన సిపి కెఆర్.నాగరాజు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలనీ ఆర్మూర్ ఏసీపీకి ఆదేశాలు జారి చేశారు.