మల్కనగిరి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా ఎమ్మెల్యే హామీ
* గ్రామపంచాయతీ వేరు చేయాలనీ
* గ్రామ ప్రజలు రిలే నిరాహార దీక్ష
బషీరాబాద్ : బషీరాబాద్ మండల్ కాశింపుర్ గ్రామపంచాయతీ అనుబంధ గ్రామము మల్కనగిరి గ్రామ యువకులు కాశింపుర్ గేట్ దగ్గర గత 8 రోజుల నుంచి గ్రామపంచాయతీ వేరు కావాలని మరియు మా ఊరు అభివృధి కావాలని రిలే నిరాహార దీక్షకు కూర్చుంన్నారు.ఇట్టి విషయాన్ని బషీరాబాద్ మండల టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే గారు వాళ్లకు ఫోన్లో మాట్లాడి మల్కన్గిరి ఊరికి సంబంధించిన డెవలప్మెంట్ విషయం మొత్తం ఏమున్నా మొత్తం నిధులు మంజూరు చేసి ఊరు డెవలప్మెంట్ చేస్తానని చెప్పి మరియు అలాగే గ్రామపంచాయతీ అయ్యే పొజిషన్ ఉంటే చేపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
అనంతరం టిఆర్ఎస్ నాయకులు అందరూ పాల్గొని ఆదివారం రోజున రిలే నిరాహారదీక్షకుకున్న గ్రామ యువకులను పెద్దలతో మాట్లాడి దీక్ష విరమింప చేయడం జరిగినది.ఇట్టి కార్యక్రమాలలో మండల టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ రామ్ నాయక్,టిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజు పటేల్,ఏఎంసి వైస్ చైర్మన్ మాజీ ఎంపిటిసి నరేష్ చవాన్,మాజీ ఎంసి వైస్ చైర్మన్ బి.ఆర్.శ్రీనివాస్,మాజీ వైన్స్ డైరెక్టర్ మోహన్ సింగ్,మండల యూత్ ప్రెసిడెంట్ తహేర్ బాండ్,మునీందర్ రెడ్డి పటేల్ రాజన్న సిద్ధిక్ మనిక్ విద్య కమిటీ చైర్మన్ శ్రీనివాస్ బాబు షరీఫ్ శేఖర్,భీమప్ప తెరాస సీనియర్ నాయకులు తదితరులు పాల్కొన్నారు.
పరామర్శిస్తున్న తెరాస నాయకులు
ఆదివారం రోజున బషీరాబాద్ మండలం రెడ్డిగానపూర్ గ్రామంలో ఈ.సంజయ్ గౌడ్ వాలా తండ్రి గారిని పరామర్శించిన మరియు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.టిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజు పటేల్ టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ రామ్ నాయక్,తెరాస సీనియర్ నాయకులు రాజు పటేల్,మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ బిఆర్ శ్రీనివాస్,మాజీ ఏఎంసి డైరెక్టర్ మోహన్ సింగ్,ఈ.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.