ప్రజలు సమస్యలను పరిష్కరించడానికె నేనున్నా
పాల్వంచ : పాల్వంచ పట్టణంలో వెంకటేశ్వర హిల్స్ కాలనీ,అయ్యప్ప నగర్ ప్రాంతాలలో నివసిస్తున్నకేటీపీఎస్ ఉద్యోగుల సౌకర్యార్థం అంతర్గత రోడ్లు డ్రైనేజీలు నిర్మించాలని ఈరోజు కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారికి వినతిపత్రం అందజేయడం జరిగినది.ఈ సందర్భంగా వనమా రాఘవేంద్రరావు గారిని మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగింది.వనమా వెంకటేశ్వరరావు వెను వెంటనే స్పందించి ఫోన్ ద్వారా మున్సిపల్ డిఇ గారికి,మున్సిపల్ ఏఈ గారికి ఇట్టి కాలనీవాసుల రోడ్లను పరిష్కరించుట కొరకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని తెలపడం జరిగింది.అనంతరం రామవరం పట్టణంలోని 9వ వార్డ్ నాగయ్య గడ్డలో గార్మి షరీఫ్ ఉత్సవాల్లో పాల్గొని, పూజలు చేసి.
అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు జెన్కో కార్యదర్శి చారుగుండ్ల రమేష్, రాష్ట్ర నాయకులు దంచనల రాంబాబు, ఆర్ శ్రీనివాస్,కేటీపీఎస్ 7 వ దశ రీజనల్ అధ్యక్ష, కార్యదర్శులు తోట కోటేశ్వరరావు ముత్యాల రాంబాబు, కేటీపీఎస్ 5&6 దశల రీజనల్ కార్యదర్శి రమేష్,నాయకులు,ధర్మపురి నాగేశ్వరరావు,మల్లెల వీరనారాయణ,లక్ష్మీనరసు,కాలువ రవికుమార్ యాదవ్ పద్మాకర్ రాజు,పర్షిక వెంకటేశ్వర్లు,రామరావు,కాలనీ వాసులు డేవిడ్,సురేష్,నగేష్,సావిత్రి,హరి,తిరుమల కుమార్,తదితరులు పాల్గొన్నారు.