ప్రతి క్షేణం ప్రజలకు అండగా ఉంటా
* మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్న ఎమ్మెల్యే
కొత్తగూడెం : సోమవారం రోజున 22వ వార్డులో హజరత్ గౌసే ఆజమ్ దస్తగిరి చిల్లా గయౄరీమీ షరీఫ్ లో ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వనమా పాల్గొన్నారు.అన్నదానం కార్యక్రమంలో పాల్కొని అనంతరం ఎమ్మెల్యే వనమా గారిని సన్మానించారు.ఈ యొక్క కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ఎంఏ రజాక్,ఉర్దూ ఘర్ చైర్మన్ ఎస్కే అన్వర్ పాషా,ఎండి యాకూబ్ పాషా 22 వ వార్డు,కో ఆర్డినేటర్,కౌన్సిలర్ యూసుఫ్,ఏఎస్జె కమిటీ సభ్యులు,గౌసె ఆజమ్ చిల్లా కమిటీ సభ్యులు మరియు 22వ వార్డు ప్రజలు పాల్కొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన నవభారత్ గ్రామ ప్రజలు
గౌరవనీయులు పెద్దలు,కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గారిని నవభారత్ గ్రామ ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి మునుగోడు ఉప ఎన్నిక విజయం పట్ల శుభాకాంక్షలు తెలిపి,శాలువా పుష్పగుచ్చంతో సన్మానించడం జరిగింది.అదేవిధంగా నవభారత్,కబీర్ తండా,కెసిఆర్ నగర్,పాలకోయ తండా,దాబా నగర్,సోనియా నగర్,శేఖరం బంజర్,పిచ్చయ్య బంజర్ గ్రామాలలో సమస్యలను వనమా గారికి గ్రామాల పెద్దలందరూ విన్నవించుకోవడం జరిగింది.ఆయన వెంటనే స్పందించి ఈ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ యొక్క కార్యక్రమంలో రాంబాబు, వీరన్న, అక్బర్, దాబా శంకర్, రాములు, సాధు శంకర్, రతన్, మంగీలాల్,దినేష్, బూడిద వీరాస్వామి, కరణ్, రవి,నూనావత్ సురేష్, మహిళా నాయకురాలు సుశీల తదితరులు పాల్గొన్నారు.
జన్మంతా ఎమ్మెల్యేకు ఋణపడి ఉంటాం
కొత్తగూడెం మున్సిపాలిటీ 26వ వార్డులో పేద దళిత వికలాంగుడికి దళిత బంధు 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఆ వికలాంగుడి కుటుంబం సంతోషంతో ఎమ్మెల్యే వనమా గారిని శల్వతో సన్మానించి,జన్మత వనమా కుటుంబానికి రుణపడి ఉంటామని అన్నారు.ఈరోజు కొత్తగూడెం మున్సిపాలిటీ 26 వ వార్డ్ లో పేద దళిత వికలాంగుడికి దళిత బంధు 10 లక్షల రూపాయలు మంజూరు చేసి,వారి యొక్క వ్యాపారాన్ని ప్రారంభించి,వారి వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని ఆశీర్వదించిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు.ఈ సందర్భంగా పేద దళిత వికలాంగుడి కుటుంబం మాట్లాడుతూ మా ఆర్థిక అభివృద్ధికి సహకరించి.
దళిత బంధు పథకాన్ని మాకు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్,ఎమ్మెల్యే వనమాకు జన్మంతా రుణపడి ఉంటామని, నన్ను గుర్తించి నాకు ఈ పథకం ఇచ్చినందుకు వనమా గారి మేలును జీవితంలో మర్చిపోలేనని అన్నారు.ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, స్థానిక కౌన్సిలర్ అంబుల వేణు, కోలాపురి ధర్మరాజు, వేముల ప్రసాద్, బండి నరసింహా మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.