మనసున్న మా రాజు మన MLA వనమా
భద్రాద్రి కొత్తగూడెం : తన పుట్టినరోజు వేడుకలలో స్టేజి కూలిన ఘటనలో గాయపడిన మేకప్ ఆర్టిస్ట్ గోవర్ధన్ పాల్వంచ,గాంధీనగర్ ఇంటికి వెళ్లి పరామర్శించి,ఆసుపత్రి ఖర్చుల నిమ్మితం 10 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించిన ఎమ్యెల్యే వనమా.గోవర్ధన్ కుటుంబ పరిస్థితి చూసి చలించిపోయి దళిత బందు కింద 10 లక్షలు ప్రకటించిన వనమా, గోవర్ధన్ మొదటి లబ్ధిదారుడు అవుతాడని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు బత్తుల మధుచంద్,ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి సోమయ్య,సంతోష్ రెడ్డి(బబ్లు), రమేష్,అన్వేష్,గోవర్ధన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
శివాలయం నిర్మాణ పనులు పరిశీలింస్తున్న ఎమ్యెల్యే
అనంతరం పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో శరవేగంగా జరుగుతున్న శివాలయం నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్యెల్యే వనమా.నవంబర్ 15 లోపల స్లాప్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ యొక్క కార్యక్రమంలో తెరాస కార్యకర్తలు,సీనియర్ నాయకులు తదితరులు పాల్కొన్నారు.
దాడికి యత్నించిన వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలి
భద్రాద్రి జిల్లా ఇల్లందు గౌరవ కోర్టు న్యాయస్థానం ఆవరణలో ఆదివాసి ఉద్యమ వీరుడు ఆదివాసి బెబ్బులి కొమరం భీం వారసత్వ వీరుడు ప్రముఖ న్యాయవాది సుర్ణపాక సత్యనారాయణ పైన నిన్న ఉదయం పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే జిల్లా ఎస్పీ గారు స్పందించి పూర్తి విచారణ జరిపి దాడికి యత్నించిన వ్యక్తుల పై తగుచర్యలు తీసుకొని ఎస్సి,ఎస్టీ, అట్రాసిటీ ,హత్యాయత్న కేసులు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని మరల ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా జిల్లా ఎస్పీ గారు కోర్టులో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని కోరడం జరిగింద.అలాగే ఆదివాసుల ఉద్యమ వీరుడు న్యాయవాది సుర్ణపాక సత్యనారాయణ పైన నిన్న ఉదయం గిరిజనేతరులు చేసిన హత్యాయత్న దాడిని తీవ్రంగా ఖండిస్తూ ,న్యాయవాదులకు రక్షణ కలిపించాలి అని జిఎస్ఎస్ కన్వీనర్ బాడిశ బిక్షం యువజన విభాగం అధ్యక్షుడు ఆరెం ప్రశాంత్ ప్రధాన కార్యదర్శి సోయం కృష్ణకుమార్ లు డిమాండ్ చేశారు.