రేపటి భావి తరాలకి ఆదర్శవంతులు కావాలి
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బొల్లోరిగూడెం లో ఉన్నటువంటి మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా పాఠశాలలో శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గారు పాల్గొని మాట్లాడుతూ పిల్లలందరూ మంచిగా చదువుకోవాలి రేపటి భావి తరాలకి ఆదర్శవంతులు కావాలని ఉన్నత స్థాయిలో ఉండాలని కోరారు, ఈ యొక్క కార్యక్రమంలో,మైనార్టీ జిల్లా అధికారి సంజీవరావు,జిల్లా మైనార్టీ స్కూల్ అధికారిని సులోచన రాణి, ప్రిన్సిపల్ అధ్యాపకులు, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు,పాల్వంచ టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మంతపురి రాజ గౌడు, పాల్వంచ మండల అధ్యక్షులు మల్లెల శ్రీరామమూర్తి కొత్తగూడెం ఉర్దూ ఘర్ చైర్మన్ ఎస్కే అన్వర్ పాషా, ఉర్దూ ఘర్ కో ఆర్డినేటర్ ఎండి యాకూబ్ పాషా 22 వ వార్డు, మరియు పాఠశాల సిబ్బంది మరియు తదితరులు పాల్కొన్నారు.
మైనారిటీల సంక్షేమమే కెసిఆర్ ధ్యేయం MLA వనమా
మైనారిటీల సంక్షేమమే ధ్యేయంగా కెసిఆర్ పరిపాలన సాగిస్తున్నారని కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు.జాతీయ విద్యా దినోత్సవం,భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా శుక్రవారం పాల్వంచ పట్టణం పరిధిలోని బొల్లారిగూడెంలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల,నవభారత్ లోని జూనియర్ కళాశాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వనమా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మైనారిటీల అభివృద్ధి కోసం వేలాది కోట్ల రూపాయులు వెచ్చిస్తూ పరిపాలన చేస్తున్నారన్నారు. మైనారిటీ గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని రేపటి భవితరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. క్రమశిక్షణతో విద్యనభ్యసించి,ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు.
ఖబరస్తాన్ రోడ్డు కోసం వినతి పత్రం
కొత్తగూడెం శాసనసభ్యులు గౌరవ శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారి నివాసంలో రామవరం ముస్లిం పెద్దలందరూ కలిసి రామవరం ఖబరస్తాన్ రోడ్డు కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి సుమారు 15 లక్షల రూపాయలు మంజూరు చేశారు.ఈ యొక్క కార్యక్రమంలో ఏఎస్జె సదర్ ఎంఏ రజాక్,ఉర్దూ ఘర్ చైర్మన్ ఎస్కే అన్వర్ పాషా,ఉర్దూ ఘర్ కో ఆర్డినేటర్ ఎండి యాకూబ్ పాషా 22 వ వార్డు,ఉర్దూ ఘర్ డైరెక్టర్ మజీద్,ఏఎస్జె సభ్యులు సమీవుద్దీన్,గౌస్ భాయ్, మొహమ్మద్ సలీం,రామవరం ముస్లిం మత పెద్దలందరూ మరియు తదితరులు పాల్కొన్నారు.