వనభోజన మహోత్సవాల.. పాల్గొన్న కొత్తగూడెం MLA వనమా
* ఆడమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో పాల్వంచ పట్టణ పెరిక సంఘం వనభోజనాలు
* పాల్గొన్న కొత్తగూడెం MLA శ్రీ వనమా వెంకటేశ్వరరావు ,వనమా రాఘవ
పాల్వంచ : ఎమ్యెల్యే వనమా గారు పెరిక సంఘ దత్త పుత్రుడు,పెరిక సంఘీయులకు రాజకీయంగా ఉన్నత స్థానం కల్పించిన ఘనత వనమా గారిదే సంఘం అధ్యక్షులు,వీర్నాల శ్రీనివాస్ పాల్వంచ టౌన్లో పెరిక (పురగిర క్షత్రియ) వనభోజన మహోత్సవాన్ని ఆడమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించారు.మామిడి తోటలో ఏర్పాటు చేసినా కార్యక్రమానికి పట్టణ వ్యాప్తంగా పెరిక కుటుంబ సభ్యులు హాజరయ్యారు. మహిళల కోలాట నృత్య ప్రదర్శన,చిన్నారుల కేరింతలతో ప్రాంగణం కోలాహలంగా మారింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎమ్యెల్యే వనమా మాట్లాడుతూ వనభోజన మహోత్సవాల వలన ప్రజా గ్రూపులు ఏర్పడతాయని,తద్వారా గ్రూపులో అభివృద్ధి కొరకు కృషి చేస్తారని ఆయన తెలిపారు.గత ఎన్నికలలో ఎమ్యెల్యేగా నా గెలుపులో పెరిక స్వసంఘియులు కీలక పాత్ర పోషించారాని,అందరికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్వంచ మండల జెడ్పిటిసి బరపాటి వాసుదేవరావు, మాజీ జడ్పీటీసీ యర్రంశెట్టి ముత్తయ్య,కుల పెద్దలు బుడగం రమేష్,దుబ్బా చెన్నమల్లు,బుడగం మోహనరావు,సముద్రాల వెంకటేశ్వరరావు,బుడగం రామ్మోహన్ రావు,వడ్డే లక్ష్మయ్య,నరెడ్ల రాము, బుడగం విజయ్, సముద్రాల ప్రభాకర్,బత్తుల మధుచంద్,పారిపతి వెంకన్న,అచ్చ కోటి లింగం,బరపటి అభి, కట్టా సంతోష్,పారిపతి కుశల్,బుసాని తేజ తదితరులు పాల్గొన్నారు.