పలు కుటుంబ సభ్యులకు పరామర్శించిన ఎమ్మెల్సీ
పేద్దేములు : పేద్దేములు మండలంలోని తట్టేపల్లి గ్రామంలో తెరాస పార్టీ నాయకులు పలు అకాల మరణం చెందడం పట్ల వారి కుటుంబ సభ్యులకు పరామర్శించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, అనంతరం కార్యకర్తలకు కుటుంబాలకు బరోసా ఇస్తూ,వారి వెంట నేను ఉంటాను అని హామీ ఇచ్చారు.అలాగే గ్రామస్తుల మేరకు తట్టేపల్లి గ్రామానికి స్కూల్ విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సు సర్వీస్ కోరడం జరిగింది,అలాగే వారి విన్నపం మేరకు ఆర్టీసి డిపో మేనేజర్ మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించాలని సూచించారు.
సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు,అలాగే వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించిన తట్టేపల్లి పిఎసిఎస్ చైర్మెన్ లక్ష్మ రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ అంజయ్య ముదిరాజ్,నారాయణ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, మైబుబ్ మీయ, షబ్బీర్,రహిం,చందు,నర్సింహులు,రమేష్,రాము,సౌరేష్,దేవప్ప,సన్నప్ప, పేద్దేములు రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు ఇందుర్ ప్రకాష్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బల్వాంత్ రెడ్డి, డి వై నర్సింహులు, గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గోపాల్ రెడ్డిని పరామర్శిస్తున్న ఎమ్మెల్సీ
పేద్దేములు మండలంలోని రూద్రారం గ్రామంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సర్పంచ్ గారి మామ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి గారి చేతి వేళ్ళు మిషన్ లో కట్ కావడం వల్ల వారి నివాసంలో గోపాల్ రెడ్డి ను పరామర్శించి,ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాలలో సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు, తట్టేపల్లి పిఎసిఎస్ చైర్మెన్ లక్ష్మ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు ఇందుర్ ప్రకాష్,సర్పంచుల సంఘం అధ్యక్షుడు బల్వాంత్ రెడ్డి,డి వై నర్సింహులు,మహిపాల్ రెడ్డి,మంబాపూర్ ఎంపిటిసి శ్రీను, హర్షవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తాండూరు మండలంలో పరామర్శిస్తున్న ఎమ్మెల్సీ
తాండూరు మండలం ఉదండాపూర్ గ్రామం చెందిన జగన్నాథ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు,నేతలు గత 11 రోజుల క్రితం జగన్నాథ్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని ఇందులో భాగంగా మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆదివారం గ్రామం చేరుకొని జగన్నాథ్ రెడ్డి కుమారుడు మహిపాల్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
జగన్నాథ్ రెడ్డి మృతి పై గ్రామస్తులతో అడిగి తెలుసుకున్నారు,అనంతరం నేతలతోని కార్యకర్తలు గ్రామ పెద్దలతో పలు అభివృద్ధి పనులపై చర్చించారు,అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్,రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు ప్రకాష్,ఉదండాపూర్ మాజీ సర్పంచ్ కేశవరావు,సంయోద్దీన్,అశోక్,అబ్దుల్ రషీద్ మియా,నర్సింలు, కాశీనాథ్ రావు, మంగలి విట్టల్,ఖలీల్,హరిచంద్ర రెడ్డి, శాంతప్ప, అమిత్ మియా, గ్రామం పెద్దలు కార్యకర్తలు పాల్గొన్నారు.