కెసిఆర్ ని ఎదుర్కొనే దమ్ము వేరెవరికి లేదు
* మునిగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం
* వనమా ముఖ్య అతిథిగా విజయోత్సవ ర్యాలీ
భద్రాద్రి కొత్తగూడెం : కెసిఆర్ ని ఎదుర్కునే దమ్ము వేరే ఏ పార్టీకి లేదని కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మునుగోడుకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో తెరాస పార్టీ ఘనవిజయం సాధించింది.పాల్వంచ మండలం పరిధిలోని పాండురంగాపురంలో తెరాస పార్టీ మండల అధ్యక్షులు పూసల విశ్వనాథం ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో వనమా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ భారతదేశంలోనే తిరుగులేని నాయకులు కెసిఆర్ అని,ఆయన పరిపాలనకు మునిగోడు ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపి తెరాస అభ్యర్థికి పట్టం కట్టారన్నారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా ప్రజలు కెసీఆర్ కు మద్దతిచ్చి,హ్యాట్రిక్ విజయం చేపడతారని వనమా అన్నారు.
సుమారు 4కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు వనమా శంకుస్థాపన చేశారు.సూరారం,పునుకుల, పుల్లాయగూడెం,సోముల గూడెం,బిక్కు నాయక్ తండా,జగన్నాధపురం, నాగారం గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం.పలు గ్రామాలలో వనమా కు బ్రహ్మరథం,భారీ ఎత్తున ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు.పూలతో వనమాను ముంచెత్తిన వైనం.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గం సుమారు 3000 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయి.కొత్తగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి దూసుకుపోతున్నది.అభివృద్ధిలో వెనకడుగు వేసేది లేదు.
పాల్వంచలో ఎమ్మెల్యే వనమా విస్తృత పర్యటన
సూర్యచంద్రులు ఉన్నంతవరకు నాభివృద్ధి కార్యక్రమాలు కనబడాలన్నదే నా సంకల్పం, లక్ష్యం.పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి పరుస్తున్నా.గాలికి ఎమ్మెల్యే అయిన వాడిని కాదు. అంచలంచలుగా వార్డు స్థాయి నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిని అయిన వాడిని.పక్కా ప్రణాళికలతో పాల్వంచ,కొత్తగూడెం పట్టణాలను జంట నగరాలుగా తీర్చిదిద్దుతున్నారు.ఎన్నికల అప్పుడు ఇచ్చిన వాగ్దానాలను క్రమ పద్ధతిలో నెరవేరుస్తున్నారు.రాష్ట్రంలో 46 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నాం.కెసిఆర్,కేటీఆర్,సహకారంతో నిధులను తీసుకువచ్చి అభివృద్ధిని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నా.పదవులతో కాలక్షేపం చేసే వాడిని కాదు. రోజుకు 18 గంటలు ప్రజలకు చేరువుగా అందుబాటులో ఉంటున్నాం అని తెలిపారు.చివరి రక్తం బొట్టు ఉన్నంతవరకు ప్రజాసేవలోనే ఉంటా.
1000 కోట్లతో నియోజకవర్గంలో జగ్గ్యాలు కట్టి రైతులకు సాగునీరు అందిస్తున్నాం.కొత్తగూడెం పట్టణంలో 10,000 మందికి క్రమబద్ధీకరణ పట్టాలను పంపిణీ చేశాం.చెప్పింది చేయడం- చేసేది చెప్పడం నా నైజాం.నియోజకవర్గ ప్రధాన కూడలిలో 30 కోట్లతో డివైడర్ను నిర్మించి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నాం.కొత్తగూడెం నియోజకవర్గంలో నా హయాంలోనే అనేక శాశ్వత కార్యక్రమాలు చేపట్టాను.మారుమూల ప్రాంతాలైన రేగళ్ల,మైలారం,బంగారుచెలక,ఉలవనూరుకు బీటీ రోడ్డు వేయించా.యానంబైల్ - రాజాపురం బ్రిడ్జి నిర్మాణం పనులు చురుకుగా చేయిస్తున్నా.త్వరలోనే ముఖ్యమంత్రి కొత్తగూడెం నియోజకవర్గానికి తీసుకువస్తున్నాం.
కలెక్టర్ ఆఫీసు, మెడికల్ కళాశాల,నర్సింగ్ కళాశాలను సీఎంతో త్వరలో ప్రారంభిస్తాం.12 కోట్లతో పాల్వంచ శ్రీనివాస్ నగర్ కాలనీ వద్ద గుట్ట మీద ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి రోడ్డు మార్గం,సెంట్రల్ లైటింగ్ మంజూరు చేయించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వనమా రాఘవేంద్రరావు,డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు,జెడ్పిటిసి సభ్యులు బరపాటి వాసుదేవరావు,ఎంపిపి మడివి సరస్వతి,తెరాస పట్టణ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్,వైస్ ఎంపిపి మార్గం గురవయ్య,మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు,సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్,మండలతెరాస అధ్యక్షులు మల్లెల శ్రీరామ్మూర్తి,పూసల విశ్వనాథం,భూక్య శంకర్, రవీందర్,మేదరమెట్ల వెంకటేశ్వరరావు,చింతా నాగరాజు,సర్పంచులు,ఉప సర్పంచులు,తెరాస నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.