తాండూర్ సమస్యలకు... చెక్ పెడ్తున్న పైలట్ !!!
- ఎమ్మెల్యే గల్లీ గల్లీ పైలెట్ కార్యక్రమంలో తెలుసుకున్న సమస్యలకు పరిష్కారం
-మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు
- పట్టణ పార్టీ అధ్యక్షులు నయీమ్ అప్ఫు
తాండూర్ : శ్రీయుత గౌరవనీయులైన తాండూర్ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆదేశానుసారం బుధవారం రోజున తాండూర్ పట్టణంలో వార్డ్ నెంబర్ 31,32,33,34,35,36,21 మరియు 27 వార్డులలో పట్టణ పార్టీ అధ్యక్షులు నయీమ్ అప్ఫు గారి ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా గ్రంధాలయ సంస్ద చైర్మన్ రాజు గౌడ్ గారు,కౌన్సిలర్ ఆసిఫ్,కౌన్సిలర్ ముఖ్తర్ నాజ్,కౌన్సిలర్ మంకల్ రాఘవేంద్ర,మరియు సీనియర్ నాయకులు నర్సింలు,నరేందర్ గౌడ్,శ్రీనివాస్ చారి,భద్రేశ్వర దేవస్థానం ఛైర్మెన్ బంటారం సుధాకర్,తదితరులు వార్డులలో పర్యటించి అక్కడ నెలకొన్నటువంటి సమస్యల్ని గుర్తించారు.
వార్డులలో నెలకున్న సమస్యలన్నీ కూడా స్థానిక ప్రజలు నాయకుల దృష్టికి తీసుకురావడంతో తక్షణమే ఈ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి గల్లి గల్లికి పైలెట్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చినటువంటి సమస్యలు మరియు ఇప్పుడు నాయకుల దృష్టికి వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా తక్షణమే వాడు కోటి రూపాయల చొప్పున గౌరవ ఎమ్మెల్యే గారు కేటాయించినటువంటి నిధులతో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని నాయకులు చెప్పడం జరిగింది.
ఇందులో ప్రధానంగా వినాయక చౌక్ లోని జంక్షన్ అభివృద్ధికై శాంతమాల్ చౌరస్తా జంక్షన్ అభివృద్ధి పై భద్రప్ప గుడి చౌరస్తా జంక్షన్ అభివృద్ధికై బసవన్న కట్ట జంక్షన్ అభివృద్ధికై ముర్షద్ దర్గా,చౌరస్తా అభివృద్ధికి విబిహెచ్ఎస్ చౌరస్తా అభివృద్ధికి గాంధీచౌక్ చౌరస్తా అభివృద్ధికి మరియు మరి చెట్టు కూడలి అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని తెలపడం జరిగింది.మరియు ఇవన్నీ చౌరస్తాలలో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయడం జరుగుతుంది.మరి అదే విధంగా ఈ మెయిన్ రోడ్లలో రెండు వైపులా మురుగు కాలువలను నిర్మించి బీటీ రోడ్లు నిర్మించడానికి నాయకులందరూ కూడా ఎస్టిమేషన్ వేయించడం జరిగింది.ఈ పనులను త్వరలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ టెడ్డి గారు పునాది రాయి పెట్టి తాండూరు పట్టణాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతారు అని తెలిపారు.
పర్యటిస్తున్న మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు
తాండూరు పట్టణని అభివృద్ధి దిశగా వెళ్తున్న పైలట్ పట్టణ కేంద్రంలోని 36 వార్డులలో ప్రజల సమస్యలను పరిష్కారం చేసేందుకు వెళ్తున్న దీప నర్సింలు.ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గల్లీ గల్లీ పైలెట్ పేరుతో అన్ని వార్డులలో కాలినడకన తిరిగి ప్రజల వద్దకు పాలనా అనే దిశగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రతి వార్డ్ లోని సమస్యలు తెలుసుకొని వార్డ్ కు 1 కోటి రూపాయిలు మంజూరు చేశారని మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు పేర్కొన్నారు.స్థానిక వార్డ్ కౌన్సిలర్లతో చర్చించి ఒక ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఆమె తెలిపారు.అన్ని వార్డ్ లలో ఎమ్మెల్యే రోహిత్ అన్న గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన పనులు త్వరలో ప్రారంభిస్తామని వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు పేర్కొన్నారు.