తెలంగాణ రాష్ట్ర మొకచిత్రంలో తాండూరుకు ప్రత్యేక గుర్తింపు
- వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు
- తాండూరు అభివృద్ధి ప్రదాత రోహితన్న
తాండూర్ : తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో తాండూరు నియోజకవర్గనికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అధిక నిధులు మంజూరు చెయ్యడం ఎంతో హర్షంచదగ్గ విషయమని,అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నరని తాండూరు మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ శ్రీమతి.పట్లోళ్ల దీప నర్సింలు ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
నియోజకవర్గ అభివృద్ధి పరుస్తూ తాండూరు పట్టణనికి పెద్దపీట వేస్తూ అన్ని వార్డులో అంగన్వాడీ,మరియు డ్వాక్రా భావనలు,చిలుకవగు అభివృద్ధికి ప్రణాళికలు మరియు అదే విధంగా 36 వార్డులకు 36కోట్ల రూపాయల నిధులు కేటాయించి వార్డులలో మౌలిక సదుపాయాలు కల్పించే దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నరన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు 134.50కోట్ల నిధులు మంజూరు చేయించినందుకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- బీసీ భవన్ కు రూ.2 కోట్లు
- బ౦జార భవన్ కు రూ.1 కోటి
- ITI కాలేజీకి రూ. 3 కోట్లు
- బషీరాబాద్ ౦డల కేంద్రానికి రూ.3 కోట్లు
- నియోజకవర్గంలోని గ్రామ ప౦చాయతీలు.. అనుబంధ గ్రామాల అభివృద్ధి కి రూ.78 కోట్లు
- డిగ్రీ కళాశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ. 1.50 కోట్లు
తాండూరు రూపురేఖలు మార్చేదిశగా అడుగులు వేస్తున్న తాండూరు ఎమ్మెల్యే శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డి గారికి తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ల తరుపున ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తాండూరు రూపురేఖలు మార్చేదిశగా అడుగులు వేస్తున్న తాండూరు ఎమ్మెల్యే శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డి గారికి తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ల తరుపున ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు విజయ దేవి,సంగత ఠాకూర్,మంకల్ రాఘవేందర్,అసిఫ్,ముక్తర్ నాజ్,అస్లాం , నాయకులు గుండప్ప,రాజాక్,సంజీవ్ రావు,సంతోష్ గౌడ్,రాజన్ గౌడ్,జవీద్,ఈర్షద్,ఇంతియాజ్ బాబా,సలిమ్,చంటి యాదవ్,ఇబ్రాహీం తదితరులు పాల్గొన్నారు.
తాండూరులో నిధుల వర్షం నయీమ్ అప్ఫు
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు అభివృద్ధి పనుల కోసం నేడు తాండూరు నియోజకవర్గ కోసం సుమారు 134.50 కోట్ల నిధులు మంజూరు చేయించారు.వెనుకబడిన ప్రాంతంలో తాండూరు ఉండే,కానీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతో నేడు తాండూరు ని అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా పెరు పొందింది.
విద్య రంగానికి పెద్ద పీట ఇస్తూ జి ఓ 369 లో ఐటిఐ కాలేజ్ కొరకు 3 కోట్లు మరియు తాండూరు పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణ కొరకు 1.50 కోట్లు మంజూరు,పట్టణం లో వార్డుల అభివృద్ధి కొరకు ప్రతి వార్డ్ కి 1 కోటి రూపాయలు,ప్రతి గ్రామ పంచాయతీ కోసం 78 లక్ష రూపాయలు మరియు మండల కేంద్రానికి 1 కోట్లు,బంజారా భవన్ కోసం 1 కోటి,బీసీ భవన్ కోసం 2 కోట్లు,తాండూరు పట్టణంలో నూతన వ్యవసాయ మార్కెట్ భవన్ నిర్మాణం కోసం 10 కోట్లు మంజూరు.
తాండూరు ప్రజా ప్రతినిధుల,ప్రజల తరఫున ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారికి మరియు ముక్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మంత్రివర్యులు కేటీఆర్ మరియు మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి మరియు ఎంపీ రంజిత్ రెడ్డి గారికి పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్ఫు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.