స్టార్ కృష్ణ మనసున్న మానవతామూర్తి ఇక లేరు
కొత్తగూడెం : మంచి మనసున్న మానవతామూర్తి దివంగత సూపర్ స్టార్ కృష్ణ గారికి అభ్యుదయ కళాసేవ సమితి ఘనమైన నివాళి!సినీరంగమంతటికి మంచి మనసున్న మానవతా మూర్తి డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్ దివంగత కృష్ణ గారు ఒక్కరే!ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్.తెలుగు సినీ ప్రపంచంలో నాటి తరం నుండి నేటి తరం వరకు మంచి మనసున్న మానవతా మూర్తిగా వివాదాలకు అతీతుడుగా ఎదుటివారిని నొప్పించకుండా తన స్వలాభం చూసుకోకుండా ఇతరుల మేలు కోసం ఆలోచించే వ్యక్తిగా ధైర్య సాహసాలకు పెట్టింది పేరుగా తెలుగు సినీ రంగంలో ఎన్నెన్నో నూతనమైన ప్రయోగాలు సంస్కరణలు తీసుకొచ్చి శభాష్ అనిపించుకొని కోట్లాదిమంది అభిమానుల హృదయాలలో స్థిర స్థానాన్ని సంపాదించి సూపర్ స్టార్ గా వెలుగొందిన దివంగత ఘట్టమనేని కృష్ణ గారు తెలుగు సినీ ప్రపంచానికే స్ఫూర్తిదాయకులు మార్గదర్శకులు అని అభ్యుదయ కళా సేవా సమితి జిల్లా అధ్యక్షులు కవి సినీగీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు.
తేనె మనసులు సినిమాతో వెండితెర...
ధైర్యంతో పోటీ తత్వంతో చిత్రాలను...
నిర్మాతల హీరోగా పేరు పొందిన స్వర్గీయ కృష్ణ కొందరు నిర్మాతలు డబ్బులు ఎగ్గొట్టిన బాధపడేవాడు కాదని ఒకవేళ ఏదైనా తన సినిమా ఫ్లాప్ అయ్యి నష్టాలు తీసుకొచ్చినప్పుడు తన రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేవాడని ఒక సంవత్సరానికి 19 సినిమాలు కూడా నటించిన రికార్డు తనకు ఉందని విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావుతో విభేదించి ధైర్యంతో పోటీ తత్వంతో చిత్రాలను నిర్మించి శభాష్ కనిపించుకున్న ఘనత కేవలం నటశేఖర కృష్ణ కే దక్కిందని ఆచార్య డాక్టర్ మద్దెల కొనియాడారు.రాజకీయాల్లో కూడా ప్రవేశించి లోక్ సభ సభ్యులుగా గెలిచి అటు రాజకీయవేత్తగా సమాజ సేవకుడిగా మంచి నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా పద్మాలయ స్టూడియో అధినేతగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా దివంగత కృష్ణ గారు అందించిన విశిష్ట సేవలు చిరస్మరణీయమని ఆచార్య డాక్టర్ మద్దెల ప్రశంసించారు.
కృష్ణ గారికి నివాళ్ళర్పిస్తున్న సినీ,రాజకీయ నాయకులు
భవిష్యత్తులో తప్పకుండా తమ సంస్థ తరఫున దివంగత కృష్ణ చిత్రాల ప్రత్యేక గీతాల సంగీత విభావరిని తప్పకుండా నిర్వహిస్తామని ఆచార్య డాక్టర్ మద్దెల హర్ష ద్వానాల మధ్య ప్రకటించారు.ఈ నివాళి కార్యక్రమంలో ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తోబాటు సంఘ ప్రధాన కార్యదర్శి అపరబాలు అల్లి శంకర్ సంఘ ఉపాధ్యక్షులు సినీ నటులు తాండూర్ ధనరాజు సంఘ గౌరవాధ్యక్షులు సినీ గాయకులు కలవల రామదాసు గౌరవ సలహాదారులు మంద హనుమంతు కమిటీ సభ్యులు మోహన్ రావు స్టీవెన్ లాజరస్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.