ఆత్మరక్షణకు తైక్వాండో సాధన అవసరం
* తైక్వాండో క్రీడాకారుల ప్రతిభ
* సర్టిఫికెట్లు అందజేసిన సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్, మాస్టర్ మనోహర్
తాండూర్ : ఆత్మరక్షణకు తైక్వాండో సాధన అవసరమని మన తెలంగాణా సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్,మాస్టర్ మనోహర్ పేర్కొన్నారు. శనివారం తాండూర్ పట్టణంలోని శివo గ్రామర్ హై స్కూల్ ఆవరణలో తైక్వొండో బెల్ట్స్ పరీక్షలు నిర్వహించారు.ఈ పరిక్షలలో సరియైన ఫిట్ నెస్ కలిగిన క్రీడాకారులకు సర్టిఫికెట్లు అందజేసారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఎల్లవేళలా చదువుతోనే పాటు స్పోర్ట్స్ అథారిటీ క్రీడలలో ఉన్న తైక్వాండో క్రీడ ఎంచుకొని పిల్లలు శ్రద్ధగా,క్రమశిక్షణతో,ప్రతిరోజు సాధన చేయాలని సూచించారు.క్రీడల పట్ల ఆసక్తి చూపడం చాలా సంతోష కరమన్నారు.అనంతరం క్రీడా కారులు చేసిన విన్యాసాలను తిలకించారు.మూఖిత్,మహిన్,నొమాన్,తదితర తైక్వొండో క్రీడాకారులకు సర్టిఫికెట్లను అందజేసారు.ఈ కార్యక్రమంలో కొచ్ కుసాల్,వివేక్,సొహేల్,యువ రాజ్,విజయ్,తదితరులు పాల్గొన్నారు.