బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన ఎమ్యెల్యే
తాండూర్ : వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలో జరిగినటువంటి ఆటో యాక్సిడెంట్ లో పెద్దముల్ మండల్ మదనంతాపూర్ గ్రామం మరియు రేగొండి గ్రామానికి చెందిన క్షతగాత్రుల కుటుంబాలని పరామర్శించి గౌరవ తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి అన్నగారి ఆదేశాల మేరకు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని పంచి ఆర్థిక సాయం అందించడం జరిగింది అలాగే వారి కుటుంబ సభ్యులకు నాయకులు మాట్లాడుతూ గౌరవ ఎమ్మెల్యే గారు తప్పకుండా తగిన న్యాయం చేస్తారని అలాగే కుటుంబ సభ్యులకు అండగా ఉంటారని చెప్పరు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు పటేల్ (నర్సిరెడ్డి) వికారాబాద్ జిల్లా కోఆప్షన్ సంఘం అధ్యక్షులు అక్బర్ బాబా మరియు పెద్దమూరు మండల బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఎస్. నారాయణ రెడ్డి మండల నాయకులు రమేష్ యాదవ్, ఉమా శంకర్, అడిచర్ల సర్పంచ్ జనార్దన్ రెడ్డి , మదనంతాపూర్ తాండ సర్పంచ్ గోవర్ధన్, మారేపల్లి తండా సర్పంచ్ పాండు నాయక్ , ఎంపీటీసీ రవి రాథోడ్, రేగుండి ఉపసర్పంచ్ శివకుమార్, లక్ష్మణ్ నాయక్, మాన్య నాయక్, రాజు, బాలప్ప, ఏసు, టి. యెసు మరియు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఘాజీపూర్ బ్రిడ్జి పనులు ప్రారంభం
శనివారం రోజున గౌరవ తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆరు సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి ఘాజీపూర్ బ్రిడ్జ్ పనులు ఈరోజు ప్రారంభమయ్యాయి అలాగే ఇట్టి బ్రిడ్జి పనులు నెలలోపే పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి బ్రిడ్జిలను తిరిగి ప్రారంభం చేస్తున్నాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్దముల్ మండల ఎంపీపీ రమేష్ అన్నగారు మరియు ఇందర్ చేడు రాజు పటేల్, మరియు యాలాల మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు మరియు వికారాబాద్ జిల్లా కోఆప్షన్ సంఘం అధ్యక్షులు అక్బర్ బాబా గారు, అలాగే భూమి కోల్పోయిన రైతులు నాగిరెడ్డి, వడ్ల సంగమేష్, మరియు పూజా ట్రాన్స్పోర్ట్ రఘు పాల్గొని బ్రిడ్జ్ పనులను పర్యవేక్షించడం జరిగింది.