ప్రభుత్వ ఆసుపత్రిలో జడ్పిటీసీ భార్య ప్రసవం
* సునీతారెడ్డి సూచనతో చేరిక
* కార్పొరేట్ తరహా సేవలు ఉన్నాయని ప్రశంసలు
దౌల్తాబాద్ : దౌల్తాబాద్ జడ్పిటీసీ కోట్ల మహిపాల్ ముదిరాజ్ తన భార్య కోట్ల ఆనందిను జడ్పి చైర్ పర్సన్ సునీతారెడ్డి గారి సూచనతో తాండూరు ఎంసీహెచ్ ఆస్పత్రిలో చేర్పించారు.అక్కడ ఆమె సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సీజరియన్ చేయాలని సూచించారని,కానీ తాండూరు జిల్లా ఆస్పత్రిలో మాత్రం వైద్యులు సాధారణ ప్రసవం చేసారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్ తరహా వైద్య సేవలు ఉన్నాయని,ప్రజలకు తెలియజేయడానికి తాను సునీతారెడ్డి గారి సూచనతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించినట్లు మహిపాల్ తెలిపారు.ఈ సంధర్బంగా సునితమ్మకు,వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.