Type Here to Get Search Results !

Sports Ad

బషీరాబాద్ లో ఈ నేల 21న ఎమ్మార్పీఎస్ సమావేశం MRPS meeting on 21st at this ground in Basheerabad

 

బషీరాబాద్ లో ఈ నేల 21న ఎమ్మార్పీఎస్ సమావేశం 

- షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ బిల్లులు   
- పార్లమెంట్ సమావేశాల్లోనే చట్ట బద్దత కల్పించాలి
- 21న ఎమ్మార్పీఎస్ బషీరాబాద్ మండలంలో సమావేశం 
- ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మల్లికార్జున్ మాదిగ
- ఎంఎస్పి మండల ఇంఛార్జి బి. కృష్ణ మాదిగ

బషీరాబాద్ : నేడు బషీరాబాద్ మండల ఎంఎస్పి ఇంఛార్జీ బి.కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల ముఖ్య నాయకుల సమావేశాన్ని బషీరాబాద్ మండలంలోనీ ఎమ్మార్పీఎస్ ఆఫీస్ లో నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మల్లికార్జున్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం చట్ట బద్దత కల్పించాలని డిమాండ్ చేశారు.బిజెపి కేంద్రంలో అధికారంలోకివొస్తే వంద రోజులు ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాటిచ్చి 8 సం"రాలు గడుస్తున్న దాని వుసే ఏత్తట్లేదని అన్నారు.ప్రజలు వేతిరేకించిన బిల్లులను అగమెగల మీద ఆమోదించిన బిజెపి 28సం"రాలుగ మాదిగల న్యాయమైన డిమాండ్ ఎస్సీ వర్గీకరణ చేయకపోవడం దుర్మార్గమన్నారు.

ఇలాంటి దోరనే భవిష్యత్తులోనూ ప్రదర్శిస్తే కచ్చితంగా రాజకీయంగా బిజెపి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.ఈ నెల 21న (బుదవారం) బషీరాబాద్ మండల ఏమ్మార్పిఎస్ సమావేశాన్ని నిర్వేహించనున్నట్లు తెలిపారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధానకార్యదర్శి కోళ్ల శివ మాదిగ హాజరు అవ్తున్నడని కాబట్టి బషీరాబాద్ మండలంలోని అన్ని గ్రామాల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మాదిగ ప్రజలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పి.రాములు మాదిగ ఎంఎస్ఎఫ్ మండల ఇంఛార్జి జీ.ప్రవీణ్ మాదిగ,గోపి మాదిగ విజయ్ కుమార్ నవీన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies