Type Here to Get Search Results !

Sports Ad

జనవరి 6న బెంగుళూరులో ఏమ్మార్పిఎస్ జాతీయ మహాసభ MRPS National Congress in Bangalore on 6th January


 జనవరి 6న బెంగుళూరులో ఏమ్మార్పిఎస్ జాతీయ మహాసభ

- షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ బిల్లుకు తక్షణమే చట్ట బద్దత కల్పించాలి
- జనవరి 6న బెంగుళూరులో జరగనున్న జాతీయ మహాసభ
- ఏమ్మార్పిఎస్ జాతీయ మహాసభను విజయవంతం చేయాలి 
- ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మల్లికార్జున్ మాదిగ

తాండూర్ : బంటారం మండల ఏమ్మార్పియేస్ ఇంఛార్జిలు కోటపల్లి బాబురావు స్వామిదస్ మాదిగ భారత్ కుమార్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల ముఖ్య నాయకుల సమావేశాన్ని బంటారం మండలంలో నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మల్లికార్జున్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఎస్సి వర్గీకరణ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం చట్ట బద్దత కల్పించాలని డిమాండ్ చేశారు.బిజెపి కేంద్రంలో అధికారంలోకి వొస్తే వంద రోజులు ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి 8 సం"రాలు గడుస్తున్న దాని వుసే ఏత్తట్లేదని అన్నారు.బిజెపి ఇలాంటి దోరణి ప్రదర్శిస్తే బిజెపి కచ్చితంగా రాజకీయంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.వచ్చేనెల జనవరి 6న బెంగుళూరులో జరగనున్న ఎమ్మార్పీఎస్ జాతీయ మహాసభ నిర్వేహించనున్నట్లు పేర్కొన్నారు.కావున బంటారం మండల నుంచి ఎమ్మార్పీఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సభాను విజయవంతం చేయండి ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గుడిసె గోపాల్ మాదిగ మండల నాయకులు లక్ష్మయ్య శివకుమార్ పెంటయ్య బాలయ్య  తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies