ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న ఎమ్మెల్యే
- సర్పన్ పల్లి ప్రాజెక్టు కాలువలకు మరమ్మతులు చేపట్టాలి
- పంట పొలాలకు సాగు నీరు అందించాలి
వికారాబాద్ : గురువారం నాడు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు "మీతో నేను" కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ మండల పరిధిలోని సర్పన్ పల్లి గ్రామంలో ఉదయం 07:00 AM నుండి 11:00 AM వరకు పర్యటించారు.సర్పన్ పల్లి ప్రాజెక్ట్ నుండి పంట పొలాలకు నీరందించే కాలువలు సరైన పద్దతిలో లేవని ప్రజలు తెలుపగా,ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ప్రాజెక్ట్ కాలువలకు మరమ్మతులు చేపట్టాలని,తాత్కాలికమైనటువంటి మరమత్తులు కాకుండా,పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.గ్రామంలో కొన్ని కాలనీలకు థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలని.
గ్రామంలోని పాత స్థంబాలను తొలగించాలని,పంటపొలాల్లో పలుచోట్ల వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలని,రైతుల కోరిక మేరకు ఓల్టేజ్ సమస్య ఉన్నందున పంట పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలన్నారు.గ్రామంలోని మిషన్ భగీరథ నీటి ట్యాంకును నెలలో 1,11,21వ తేదీలలో కచ్చితంగా శుభ్రం చేయాలన్నారు.గ్రామంలో పాడు బడ్డ ఇండ్లు మరియు పిచ్చిమొక్కలు తొలగించాలని,మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.
మిషన్ భగీరథ పైపుల లీకేజీలను వెంటనే సరి చేసి,గ్రామ ప్రజలకు సరిపడేలా గేట్ వాల్వ్ ఏర్పాటు చేయాలని,8వ వార్డు ప్రజలకు సరిపడా నీరు అందించాలని,ప్రజలకు పరిశుభ్రమైన మంచినీటిని ప్రతి ఇంటికి అందించాలని, ప్రజలు మిషన్ భగీరథ నీటిని త్రాగేలా మిషన్ భగీరథ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.గ్రామంలోని అవసరమైన చోట రోడ్లు మరియు మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేద్దామన్నారు.గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని వాటిని వాడుకలో ఉంచాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఎయిడ్స్ పై అవగాహన కల్పించాలి
- ఎయిడ్స్ భూతాన్ని నిర్మూలిద్దాం
- ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
గురువారం నాడు వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్బంగా వికారాబాద్ పట్టణంలోని డైట్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తున్న వారికి,వైద్య వృత్తిలో మంచి సేవలు అందించిన వారికి మరియు విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు,ఏఎన్ఎం లు,ఆశా వర్కర్లు,నాయకులు,ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.