Type Here to Get Search Results !

Sports Ad

విద్యార్థులకు అండగా బహుజన్ సమాజ్ పార్టీ Bahujan Samaj Party stands with students

 

విద్యార్థులకు అండగా బహుజన్ సమాజ్ పార్టీ

- సమస్య వస్తే ముందుండి పరిష్కరిస్తాం
- బహుజన్ సమాజ్ పార్టీ తాండూర్ అసెంబ్లీ ఇన్చార్జి పి.అరుణ్ రాజ్

తాండూర్ : తాండూర్ బస్ డిపో తాండూర్ ఆర్టీసీ బస్ తాండూర్ టు మదనంతాపూర్ వెళ్లే బస్సు మార్గం మధ్యలో మంబాపూర్ గ్రామం దగ్గర బస్సు పంచర్ కావడం వలన అక్కడ పక్కకు ఆగిన బస్సు ఆ యొక్క బస్సు అద్దాలు గుర్తుతెలియని దండగులు అద్దాలు పగలగొట్టడం జరిగింది.అయితే మా విలేజ్ కు బస్సు రావడం లేదు అని తాండూర్ బస్ డిపో మేనేజర్ కు విద్యార్థులు అడగడం జరిగింది. అయితే సమయానికి బస్సు రావడం లేదు అని అడిగిన విద్యార్థులకు తాండూర్ బస్ డిపో మేనేజర్ అనుచిత వాక్యాలతో ఆ విద్యార్థులకు బస్సు యొక్క అద్దాలు పగలగొట్టింది మీరే అని మీ పైన కేసు పెడతాము అని ఆ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది.అయితే ఆ విద్యార్థులు మా గ్రామానికి బస్సు సరైన సమయానికి రావాలి అని అదేవిధంగా మాపై నేరం వేసిన ఆ నేరానికి మాకు ఏ సంబంధం లేదు అని మంబాపూర్ రోడ్ దగ్గర విద్యార్థులు నిరాసన చేయడం జరిగింది.ఆ విద్యార్థులకు మద్దతుగా తాండూర్ అసెంబ్లీ ఇన్చార్జ్ బహుజన్ సమాజ్ పార్టీ పి అరుణ్ రాజు వారికి ఈ సమస్యకు ఎటువంటి సంబంధం లేదు అమాయకమైన విద్యార్థులను ఈ సమస్యలోకి లాగకూడదు.సమయానికి బస్సులు రావాలి అని విద్యార్థులకు మద్దతుగా తాండూర్ బీఎస్పీ అసెంబ్లీ ఇంచార్జ్ తెలియజేయడం జరిగింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies