Type Here to Get Search Results !

Sports Ad

తెలంగాణ మెడికల్ హెల్త్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన రజనీకాంత్ బండారి B.Rajinikanth

 

తెలంగాణ మెడికల్ హెల్త్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన రజనీకాంత్ బండారి             


భద్రాద్రి కొత్తగూడెం : హైదరాబాదులోని బాగ్ లింగంపల్లి  సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగ అధ్యక్షులు జి.రాంబాబు యాదవ్ అధ్యక్షతన ఆదివారం యూనియన్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకు పిఆర్సిలో 30% జీతాలు పెంచడానికి నిర్ణయించడం చారిత్రక గట్టమని తెలిపారు.నూతనంగా రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది.తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర  అధ్యక్షుడిగా దుర్గం శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.రాష్ట్ర కమిటీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెందిన కొత్తగూడెం జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలక్ట్రిషన్ గా చేస్తున్నా బండారి రజనీకాంత్ ని రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు.

రజనీకాంత్ బండారి మాట్లాడుతూ నూతనంగా రాష్ట్ర కమిటీ లో ఉపాధ్యక్షులుగా ఆకాశం కనిపించినందుకు నిరంతరం వైద్యరంగం,వివిధ రంగాల్లో ఉన్న ఔట్సోర్సింగ్ కార్మికుల కోసం నిరంతరం పోరాడు తానని నా మీద ఉంచి బాధ్యతను నిరంతరం కార్మిక ఉద్యోగులకు అందుబాటులో ఉంటానని రజినీకాంత్ బండారి తెలిపారు.జనవరి 3వారంలో తెలంగాణ మెడికల్ మెడికల్ అండ్ హెల్త్ అవుట్ సోర్సింగ్  కాంట్రాక్టర్ ఎంప్లాయిస్ యూనియన్ మొదటి మహాసభ హైదరాబాదులో నిర్వహించాలని తీర్మానం చేశారు.నన్ను రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్ కి మరియు భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం అధ్యక్షులు జి రాంబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు రజనీకాంత్ తెలిపారు.రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రజనీకాంత్ బండారినీ నియమించినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు మాతంగి రాజు ఉదయ్,శీను,మహేందర్,హర్షం వ్యక్తం చేశారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies