Type Here to Get Search Results !

Sports Ad

తెలంగాణ బిడ్డ తొలి మహిళా క్రికెట్‌ కోచ్‌గా బుర్రా లాస్య Burra Lasya is Telangana's first woman cricket coach

 తొలి మహిళా క్రికెట్‌ కోచ్‌గా బుర్రా లాస్య 

- తెలంగాణ నుంచి మొదటి మహిళా క్రికెట్‌ కోచ్‌గా బుర్రా లాస్య 
- రాష్ట్రం గర్వించేలా మరిన్ని విజయాలు
- అభినందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌ : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన బుర్రా లాస్య తెలంగాణ నుంచి తొలి మహిళా క్రికెట్‌ కోచ్‌గా ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) అకాడమీ ప్రపంచవ్యాప్తంగా ఎంపిక పరీక్ష నిర్వహించగా దేశంలో ఎంపికైన ముగ్గురు క్రీడాకారుల్లో లాస్య ఒకరు.బాల్యం నుంచే లాస్యకు క్రికెట్‌పై ఎంతో ఆసక్తి అదే ఆసక్తితో క్రికెట్‌ ఆట మెలకువల పై హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నారు. అనంతరం ఐసీసీ నిర్వహించే మొదటి శ్రేణి శిక్షణ కోర్సును పూర్తి చేసుకున్నారు.అందులో ఉత్తీర్ణత సాధించి కోచ్‌గా ఎదిగారు.శనివారం తన తండ్రి రమేష్‌తో కలిసి వచ్చిన లాస్య రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఆయన నివాసంలో కలిశారు.ఈ సందర్భంగా మంత్రి ఆమెను అభినందించి రాష్ట్రం గర్వించేలా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.లాస్య తల్లి సునీత జాతీయ అథ్లెట్‌ తండ్రి రమేష్‌ వాలీబాల్‌ క్రీడాకారుడు.ప్రస్తుతం లాస్య తల్లి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా యువజన క్రీడల అధికారిణిగా తండ్రి జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్మనుగా కొనసాగుతున్నారు.క్రికెట్‌లో మెరుగైన శిక్షణ ఇస్తూ ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని లాస్య తెలిపారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies