సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఒక వరం
తాండూర్ : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శుక్రవారం రోజున తమ క్యాంప్ ఆఫీసులో యాలాల్ మండలానికి చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.యాలాల్ మండలం ముద్దాయి పేట్ గ్రామానికి చెందిన పెద్ద చిన్నయ్య గారికి 2,50,000/- రూపాయల చెక్కు పంపిణీ చేయడం జరిగింది.రస్నం గ్రామానికి చెందిన లాల్ మహ్మద్ గారికి 1,50,000/- చెక్కు పంపిణీ చేయడం జరిగింది.ముద్దాయిపేట్ గ్రామానికి చెందిన మహమ్మద్ బేగం గారికి 1,00,000/- చెక్కు పంపిణీ చేయడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో యాలాల మండల వైస్ ఎంపీపీ రమేష్ గారు,వికారాబాద్ జిల్లా కో ఆప్షన్ నెంబర్ అధ్యక్షులు అక్బర్ బాబా,దేవునూర్ సర్పంచ్ శివకుమార్,ముద్దయిపేట శ్రీనివాస్ గౌడ్,రస్నం మధు,అగ్గనుర్ కోట్ల మహేశ్వర్ రెడ్డి (దత్తు),యాలాల మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రజా ప్రతినిధుల,కార్యకర్తల ముఖ్య సమావేశం
గౌరవ తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యాలాల మండల ప్రజా ప్రతినిధుల మరియు కార్యకర్తల ముఖ్య సమావేశం.ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారికి సమక్షంలో యాలాల మండలానికి మరియు పలు గ్రామాలకు మరియు మండల హెడ్ క్వార్టర్స్ కు ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామానికి 50 లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందో అట్టి నిధుల సమీకరణ గురించి పలు గ్రామాలలో జరగబోయే అభివృద్ధి పనుల కోసం గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో గౌరవ సభ్యులు చర్చించడం జరిగింది.అందుకు గౌరవ ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందిస్తూ యాలాల మండల అభివృద్ధి విషయంలో ఏ సమస్య ఉన్న అట్టి సమస్యని తీర్చే దిశలో ఉంటానని చెప్పడం జరిగింది.అందుకు గౌరవ యాలాల మండల ప్రజా ప్రతినిధులు గౌరవ ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలిపారు.అలాగే తాండూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే గారికి యాలాల్ మండల ప్రజల తరఫున ప్రజా ప్రతినిధుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సహాయం చేయమని కోరిన కోటపల్లి గ్రామస్థులు
తాండూర్ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి గారిని తాండూర్ క్యాంపు కార్యాలయంలో కోటపల్లి గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు అందరూ కలిసి హనుమాన్ మందిర్ నిర్మాణం కోసం సహాయం చేయాలని కోరగా సానుకూలంగా స్పందించి తన వంతు సహాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. గ్రామ పెద్దలు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.