Type Here to Get Search Results !

Sports Ad

ఘనంగా జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు The Congress party's inauguration ceremony

 

ఘనంగా జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు

- ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్.జి.రవి              

ఇల్లందు : ఇల్లందు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డానియల్ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఇల్లందు నియోజకవర్గ ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి.రవి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  దేశ స్వాతంత్ర కాంక్ష కోసం ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ తర్వాతి రోజుల్లో సుదీర్ఘ పోరాటాలు చేసి అఖండ భారతదేశానికి స్వాతంత్రాన్ని సిద్ధింప చేసిందని అదేవిధంగా దశాబ్దాల తెలంగాణ  స్వరాష్ట్ర కాంక్షని కూడా నెరవేర్చింది.కాంగ్రెస్ పార్టీ అని వారు తెలిపారు.దేశంలో ఐఐటి,ఐఐఎం,ఎయిమ్స్,జవహర్ నవోదయ స్కూల్ లాంటి అతి పెద్ద విద్యసంస్థలను,బీహెచ్ఈఎల్,బీడీఎల్,విమానయాన,రైల్వేలు,ఓడరేవులు లాంటి సంస్థల స్థాపించి దేశ ప్రగతికి మరియు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది.

కాంగ్రెస్ పార్టీ అని,హరిత విప్లవం,శ్వేత విప్లవం ద్వారా యావత్ భారత్ జాతికి అన్నం పెట్టింది.కాంగ్రెస్ పార్టీ అని,బాక్రానంగల్ లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులను నెలకొల్పింది కాంగ్రెస్ పార్టీ బ్యాంకులను జాతీయ కరణం చేసి ప్రజలందరిని ఆర్థికంగా పరిపుష్టి చేసింది.కాంగ్రెస్ పార్టీ దేశంలో జాతీయ వాదం,లౌకికవాదం,ప్రజలందరికీ సమాన హక్కు అనే మౌలిక సూత్రాల పైన కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తినడానికి తిండి,కట్టుకోవడానికి బట్ట లేని పరిస్థితుల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నాగార్జునసాగర్,శ్రీరామ్ సాగర్,భీమా,జూరాల,కోయిల్ సాగర్,నెట్టెంపాడు,అప్పర్ మానేరు,మిడ్ మానేరు లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులను కట్టి రైతుల జీవితాల్లో వెలుగు నింపింది.కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ,లక్షలాదిమంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగులకు లక్షలాది ఉద్యోగ అవకాశాలు,రైతులకు రుణమాఫీ,పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ లాంటి ఉచిత వైద్య సహాయం,ప్రతి నిరుపేద కుటుంబానికి అమ్మ అభయ హస్తం ద్వారా ఉచిత రేషన్ అందించింది.

మహిళలకు పావలా వడ్డీ కింద రుణాలు,వికలాంగులకు,వృద్ధులకు పింఛను అందించింది కాంగ్రెస్ పార్టీ అని వారు ఉద్ఘాటించారు.కానీ నేడు కేంద్రంలో మతతత్వ బిజెపి పార్టీ దేశంలోని రాష్ట్రాలలో మతాల వారిగా,కులాల వారిగా విడగొడుతు,కాంగ్రెస్ పార్టీ స్థాపించిన వివిధ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ దేశ అభివృద్ధిని 50 సంవత్సరాలు వెనక్కినెట్టిందని,అదేవిధంగా రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పరిపాలన వల్ల  ఏ ఒక్క సామాజిక వర్గం,విద్యార్థులు,రైతులు,కార్మికులు అభివృద్ధికి నోచుకోలేదని,తిరిగి ప్రజలందరూ ఆర్థికంగా,సామాజికంగా,రాజకీయంగా ఎదగాలంటే రాష్ట్రంలో మరియు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావలసిన తరుణం ఆసన్నమైనదని వారు తెలిపారు.కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి,దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies