Type Here to Get Search Results !

Sports Ad

డబుల్ బెడ్ ఇస్తారా...గుడిసెలు వేసుకోమంటారా ? Do you give a double bed room do you want to put up huts?

 

డబుల్ బెడ్ ఇస్తారా... గుడిసెలు వేసుకోమంటారా

- అర్హులైన నిరుపేదలకు ఖాళీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి
- మూడు లక్షల ఇండ్ల స్కీం వర్తింపజేయాలి 
- ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరుపేదలు గుడిసెలు వేసుకుంటారు
- మూడు సంవత్సరాల కింద శంకుస్థాపన
- సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకరెడ్డి

ఘన్ పూర్ : (స్టే)ఘన్ పూర్ మండల కేంద్రంలో సోమవారం రోజున సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఘన్ పూర్ రెవిన్యూ పరిధిలో గత మూడు సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం డబుల్ బెడ్ రూమ్ లకు శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని ఈరోజు పరిశీలన చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్నిదేశిస్తూ సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు డబుల్ బెడ్ రూమ్ లు నిరుపేదలకు అందరికీ ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా పూర్తిగా ఇవ్వని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.ఘన్పూర్ మండల కేంద్రంలో మూడు సంవత్సరాల కింద శంకుస్థాపన చేస్తే ఇప్పటివరకు పునాది స్థాయిలోనే ఉన్నాయని అన్నారు నిరుపేదలు ఇండ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇండ్ల కిరాయికి అద్దె చెల్లించలేక అవస్థలు పడుతున్నారని అన్నారు.

ఘన్ పూర్ శివుని పెళ్లి గ్రామాలలో దరఖాస్తులు ఇచ్చి చాలామంది పేదలు ఎదురుచూస్తున్నారని ఇప్పటికైనా అధికారులు పరిశీలించి వారం రోజుల్లో ఘన్పూర్ శివుని పెళ్లి గ్రామాలలో అర్హులైన నిరుపేదలకు ఖాళీ స్థలాలు కేటాయించాలని అన్నారు.లేకుంటే ఇదే భూమిలో సిపిఎం పార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పేదలే గుడిసెలు వేసుకుంటారని హెచ్చరించారు.దానికి ప్రారంభ సూచికంగా ఈ రోజు ఇక్కడ ఎర్రజెండాను పాతారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు,సిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్,జిల్లా కమిటీ సభ్యులు ఎన్నకూస కుమార్,కోడెపాక యాకయ్య,నాయకులు చిలుముల్ల భాస్కర్,కొండ వేణు,ఎడ్ల ప్రశాంత్,మర్రి రమేష్,గుడ్లపల్లి రాజు, మేడబోయిన యాదగిరి,పిట్టల సుమన్,బోనగిరి బాబురావు,పిట్టల పద్మ,జి.మమత,యన్.రాధిక,సిహెచ్ మంజుల తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies