Type Here to Get Search Results !

Sports Ad

ప్రతి మహిళల సద్వినియోగం చేసుకోవాలి Every woman should take

ప్రతి మహిళల సద్వినియోగం చేసుకోవాలి 

- శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి
- ఆర్ధికంగా మీ ఎదుగుదల బాధ్యత నాది
- సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలు తెలంగాణలో ఉన్నాయి
- రాష్ట్రంలో మొదటిసారిగా మహిళల కుట్టు మిషన్ పథకం 
- శిక్షణ తీసుకున్న మహిళలు ఆర్థికంగా ఎదిగేలా చేయడం మా బాధ్యత
- గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ
- మహిళా సాధికారత లక్ష్యంగా 3000 మంది మహిళలు
- కుట్టు మిషన్ శిక్షణా తరగతులను ప్రారంభం 
-మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

పాలకుర్తి : పాలకుర్తి పట్టణంలో మహిళా సాధికారత లక్ష్యంగా  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మరియు స్త్రీ నిధి సహకారంతో రాష్ట్రంలో మొదటిసారిగా పాలకుర్తి  నియోజకవర్గంలోని 3000 మంది మహిళలకు కుట్టు మిషన్ శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో,డీడీసీబీ దగ్గర ప్రారంభించారు.అనంతరం శిక్షణ పొందే మహిళలు, స్థానిక నేతలు,సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారు వచ్చాక మహిళలకు ఎంత ప్రాధాన్యత వచ్చింది.రాకముందు ఎలా ఉండేది.ఈరోజు అందరం సమీక్ష చేసుకోవాలి.నేను 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉండి 7 సార్లు గెలిచాను.చాలా మంది సీఎం లను, పార్టీలను చూసాను.కానీ సీఎం కేసీఆర్ గారు చేసినట్లు ఎవరూ చేయలేదు.నేను ఎమ్మెల్యే అయినప్పుడు నా నియోజక వర్గంలో,రాష్ట్రంలోని అక్కా,చెల్లెళ్ళు కుండలు పట్టుకుని నీళ్ళ కోసం నిలబడే వారు.నీళ్లకు బోరింగ్ వేస్తే చాలు అనేవాళ్లు కానీ కేసిఆర్ గారు 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టీ మిషన్ భగీరథ తెచ్చి ఇంటింటికీ మంచి నీరు ఇస్తున్నారు.

ఈ మిషన్ భగీరథ శాఖ కూడా సీఎం గారు నాకే ఇచ్చిండ్రు.కొంత మంది మూర్ఖులు ఉంటారు.ఇవన్నీ చేస్తున్నా ఎప్పుడూ ఏమి చేయలేదు అంటారు.అప్పట్లో మహిళలు బయటకు రావడానికి భయపడే వాళ్లు.ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు డ్వాక్రా మహిళలకు ఒక రూపాయి ఇస్తే బ్యాంక్ లో వేయడానికి వెళ్తే కూడా అభాండాలు వేసేవాళ్లు.కానీ ఇప్పుడు బ్యాంక్ కు నేరుగా వెళ్లి దర్జాగా వేస్తున్నారు.మహిళలకు డబ్బులు రావడం వల్ల వారిపై అరాచకాలు తగ్గాయి.తెలంగాణ రాక ముందు మహిళలకు 4 వేల కోట్ల రూపాయల రుణాలు వచ్చేవి. ఇపుడు 18వేల కోట్ల రూపాయల రుణాలు ఇస్తున్నాం.మహిళలకు చైతన్యం  వచ్చింది మహిళా సంఘాలు ఇంకా బాగా అభివృద్ధి కావాలి.నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పటి నుంచి మహిళా సంఘాలతో నాకు మంచి స్నేహం ఉన్నది.నేను వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఉన్నపుడు మహిళలు రూపాయి,రూపాయి ఇచ్చి నా నామినేషన్ కు డబ్బులిచ్చి,నామినేషన్ వేసేవాళ్లు.నేను ఇపుడు మీ మంత్రిగా ఉన్నాను దీనిని బాగా సద్వినియోగం చేసుకోవాలి అభివృద్ధి కావాలి.గ్రామంలో ప్రతి వస్తువు మనమే తయారు చేయాలి.మధ్య దళారులు బతికే బదులు మనమే బ్రాండ్ తయారు చేయాలి.పసుపు,పప్పు దినుసులు,కారం అన్ని మనమే తయారు చేయాలి.డబ్బుకు ప్రభుత్వం దగ్గర డోకా లేదు ఎంత డబ్బు అయినా ఇస్తాను మీ మీద విశ్వాసం ఉంది.మహిళలు బకాయి ఉంటే నిద్ర పోరు మీకు ఆ మంచి పేరు ఉంది.అందుకే బ్యాంక్ లు ముందుకు వచ్చి రుణాలు ఇస్తున్నాయి.నాకు రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే పాలకుర్తి నియోజకవర్గం ఒక ఎత్తు.స్త్రీ నిధి కింద మహిళలు ఒక్కొక్కరికి 3 లక్షలు ఇస్తున్నాం. దురదృష్టవశాత్తూ  చనిపోతే రుణం మాఫీ చేయమని సీఎం కేసీఆర్ గారు చెప్పారు.

ఒకవేళ సగం డబ్బులు కట్టిన తరవాత చనిపోతే మిగిలిన సగం కూడా వాపస్ ఇవ్వమన్నారు.అభయ హస్తం కింద డబ్బులు కట్టిన వారికి మిత్తితో కలిపి వాపస్ ఇస్తున్నాం.డబ్బులు కట్టిన వారికి 2వేల పెన్షన్ కూడా ఇస్తాం.నా ఆలోచనతో ఈ పథకం పెట్టాం హాస్టళ్ళలో బట్టలు కుట్టే పని వేరే వారికి ఇస్తున్నాం.మన మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఇస్తాం అని సీఎం కేసీఆర్ గారితో అన్నాను.సంగెం మండలంలో టెక్స్ టైల్  పార్క్ కు 10 వేల మంది అవసరం.కొడకండ్లలో కూడా మినీ టెక్స్ టైల్ పార్క్ వస్తుంది.వీటి వల్ల మహిళలకు ఉపాధి, ఉద్యోగం లభిస్తుంది.ఇది చెబితే సీఎం గారు అభినందించారు. పాలకుర్తిలోనే పెడుతున్నా అన్నాను వెంటనే అనుమతి ఇచ్చారు.దీనికి మా సెక్రటరీ గారు కూడా సపోర్ట్ చేశారు.3 నెలల తరవాత మరొక బ్యాచ్ మొదలు పెడుతాం.ఇది కంటిన్యూ గా జరిగే శిక్షణ కార్యక్రమం.



జ్యోతిని వెలిగిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 

టెక్స్ టైల్ పార్క్ లో ఉద్యోగాలు ఇవ్వడానికి  35 సంవత్సరాల లోపు ఉన్న వారు కావాలి అని టెక్స్ టైల్ పార్క్ వాళ్ళు అడిగారు.అందుకే ఈసారి శిక్షణ కోసం 35 ఏళ్లలోపు మహిళలు అని నిబంధన పెట్టాము.జాబ్ వద్దు అనుకున్న వాళ్ళు 40,50 ఏళ్లు ఉన్నా వచ్చే బ్యాచ్ లో శిక్షణ ఇస్తాం.వచ్చే బ్యాచ్ కు వయో పరిమితి,విద్య అర్హత నిబంధన తీసేయమని చెబుతున్నాను.ఈ కుట్టు మిషన్ల శిక్షణ కోసం 10వేల రూపాయలు స్త్రీ నిధి నుంచి 7 వేల రూపాయలు చొప్పున ఒక్కొకరిపై 17 వేల రూపాయల ఖర్చు చేస్తున్నాం.మొత్తం 5 కోట్లు ఖర్చు చేస్తున్నాము.దీనిని సద్వినియోగం చేసుకోవాలి.రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఏ బట్టలు ఆర్డర్ ఇచ్చినా అది మనకే వచ్చేటట్లు చేస్తాను.దీనిని తరవాత దశలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం.జనగామలో మామిడి పండ్లు,సీతాఫలాలు,ఖమ్మం,మహబూబాబాద్ లో మహిళలు మిర్చి వ్యాపారం చేస్తున్నారు.మంచి లాభాలు వస్తున్నాయి మీరు వ్యాపార వేత్తలు కావాలి.

వ్యాపారం చేయడానికి ముందుకు వస్తె హైదరాబాద్ లో నేను శిక్షణ ఇప్పిస్తాను.అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వారితో ఒప్పందం పెట్టుకున్నాం.దేశంలో తెలంగాణ రాష్ట్రమే ఇలాంటి ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం.మహిళా సంఘాలు చేసే వాటిపై వారికి అపార నమ్మకం ఉంది. నేను మంత్రిగా ఉన్నపుడు మీరు అంతా పైకి రావాలి అన్నది నా కోరిక.ప్రతి మండలంలో మహిళా సమాఖ్య భవనాలు ఉండాలని చెప్పాను. ప్రణాళిక తయారు చేస్తున్నాం.ప్రతి గ్రామంలో సమాఖ్య భవనాలు కట్టిస్తాను. అక్కడ మహిళలు అంతా కూర్చోని, సమీక్షించుకుని పని చేసేందుకు ఉపయోగ పడుతుంది.మీరు గ్రామం అంతా కలిసి వచ్చి మాకు భవనం కావాలి అని అడిగితే ఇస్తాను.మీరు కలిసి ఉండండి..కలిసి అభివృద్ది కావాలి.

మహిళలు ఖర్చు వృథా చేయరని నా నమ్మకం. సీఎం కేసీఆర్ గారికి మీ మీద అపార నమ్మకం.అందుకే మీకు కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చాడు. ఎవరైనా ఈ దేశంలో చేస్తున్నారా? మేనమామ గా లక్ష రూపాయలు ఇస్తున్నారు.పెన్షన్లు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా 2000 రూపాయాలు ఇవ్వడం లేదు. కోడళ్ళు అత్తకు 2000 వస్తె వారిని బాగా చూసుకుంటున్నారు.ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడాలేవు.గతంలో నీళ్ళ లేక ఎంత గోస పడ్డాం. ఇప్పుడు చెరువులు నీళ్లతో నిండి ఉన్నాయి. మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి.నేను ఇద్దరు ముఖ్యమంత్రులను ఇష్ట పడుతాను. ఒకరు ఎన్టీ రామారావు గారు. మరొకరు కేసిఆర్ గారు.పేదల కోసం ఎన్టీఆర్ గారు పథకాలు పెడితే సీఎం కేసీఆర్ గారు వారి సంక్షేమం కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు.ఈ ప్రభుత్వాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత మనది.శిక్షణ అయ్యాక మీ భారం నాది ఆర్ధికంగా మీ ఎదుగుదల బాధ్యత నాది.పశు మిత్ర కింద మహిళలకు శిక్షణ ఇప్పించాను మంచిగా చేస్తున్నారు.

గౌరవ వేతనం అడుగుతున్నారు.సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తా.పశు మిత్ర కింద శిక్షణ తీసుకున్న వాళ్ళు ఇంటి ముందు వైద్యం ఇస్తున్నారు.మీరు ఎందులో శిక్షణ కావాలన్నా అందులో శిక్షణ ఇస్తున్నాం.మహిళలు డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేసుకోవాలి. అక్కడ మంచి చికిత్స ఉంది.ప్రైవేట్ లో ఎక్కువగా ఆపరేషన్లు చేస్తున్నారు.ఆపరేషన్ అయ్యాక చాలా ఇబ్బంది ఉంటుంది. తల్లి పాలు తాగక పిల్లల ఎదుగుదల సరిగా ఉండదు.తల్లి పాలు తప్పకుండా తాగాలి తప్పదు అన్నపుడు మాత్రమే ఆపరేషన్ చేసుకోవాలి.ఆపరేషన్ తల్లి, పిల్ల ఇందరికిని బలహీనం చేస్తుంది.కేసిఆర్ కిట్ కింద అమ్మాయి పుడితే 13 వేలు, అబ్బాయి పుడితే 12 వేలు ఇస్తున్నారు.ఇపుడు కొత్త స్కీం న్యూట్రిషన్ కిట్ ఇస్తున్నాం భూపాలపల్లి,ములుగులో ప్రారంభం చేశాం.ఇక్కడ కూడా చేస్తాం ప్రైవేట్ హాస్పిటల్ కు పోవద్దు ఆపరేషను చేసుకోవద్దు.


సభకు హాజరైన మహిళలు

సెక్రటరీ సందీప్ సుల్తానియా మాట్లాడుతూ  ఇది ఆదాయం పెంచే కార్యక్రమం.టెక్స్టైల్ పార్కుల్లో పని చేయడానికి శిక్షణ పొందిన వాళ్ళు కావాలి.మనం శిక్షణ పొందకపోతే కంపెనీల వాళ్ళు వేరే ప్రాంతాల నుంచి తెచ్చుకుంటారు.అలా జరగకుండా ఉండాలని స్థానికులకు ఉద్యోగాలు రావాలి అని మంత్రి గారు  పాలకుర్తి లో ఈ కార్యక్రమం పెట్టారు.శిక్షణ తరవాత ఉచితంగా కుట్టు మిషన్ ఇస్తారు.మీరు మంచిగా శిక్షణ పొందితే మీకు మంచి భవిష్యత్ ఉంటుంది.200 కోట్ల రూపాయలు బట్టలు కుట్టడం కోసం ఖర్చు చేస్తుడగా అందులో 40 కోట్ల రూపాయలు కుట్టు కూలీల కోసం ఖర్చు చేస్తోంది.ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైమ్ మినిస్టర్ స్కీం లో తెలంగాణ నంబర్ వన్ గా ఉన్నది.ఇందులో కూడా మహిళలు పెద్ద ఎత్తున ఉపాధి పొందవచ్చు.మహిళలు సాహసం చేస్తే అనేక రంగాల్లో రాణిస్తారు.ఫ్లిప్ కార్ట్ తో ఒప్పందం జరిగింది. మన మహిళలు తయారుచేసిన ఉత్పత్తులు అందులో అమ్ముతున్న వాటికి మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు మహిళల ఉత్పత్తులు అన్ని కలిపి రాష్ట్ర స్థాయిలో బ్రాండ్ చేసే అలోచన చేస్తున్నాం.

కలెక్టర్ శివ లింగయ్య మాట్లాడుతూ జనగామలో ఇది ముఖ్య కార్యక్రమం మహిళా మణులు ఆర్ధికంగా ఎదగడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.మహిళల వ్యాపార వేత్తలుగా మారే అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.మహిళా సంఘాల ఆధ్వర్యంలో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయిస్తున్నాం.సంఘంగా కాకుండా వ్యక్తిగతంగా ఈ గ్రూప్ సభ్యులు లబ్ది పొందేందుకు ఈ కుట్టు మిషన్ శిక్షణా తరగతులను ప్రారంభించాం.కుట్టు మిషన్ వచ్చిన వారికి చాలా పని ఉంది.వీరిని వ్యాపార వేత్తలు చేయడమే లక్ష్యంగా 30 రోజుల శిక్షణ ఇస్తున్నాం.ఈ శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి.మీ బ్యాచ్ రాబోయే వారికి ఆదర్శంగా మారాలి.డిజైనింగ్ లో కూడా శిక్షణ ఇస్తాం.

ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి,పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ది శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియ, జనగామ జిల్లా కలెక్టరు శివ లింగయ్య,అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్,పిడి డి.ఆర్.డి.ఏ శ్రీరామ్ రెడ్డి,పాలకుర్తి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్య శర్మ,డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర రెడ్డి,మాజీ చైర్మన్ గాంధీ నాయక్ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి,ఎంపీపీలు సావిత్రి, జ్యోతి,సర్పంచ్ ఏకాంత రావు స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు అధికారులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies