ఆస్తికి అడ్డొస్తే...కన్న కొడుకును చంపినా తండ్రి
-దారుణం కన్న కొడుకును ఓ తండ్రి హతమార్చడు - ఆస్థి తగాదాలే కారణం- భయాందోళనలో ఉన్న ప్రజలు
తాండూర్ : ఈ రోజుల్లో కన్నా పేగుకు కరువైన కన్నా ప్రేమ ఆస్థి తగాదాల వాళ్ళ కన్న కొడుకును చంపినా ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం ఇందూర్ చోటు చేసుకుంది.పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తాండూర్ నియోజకవర్గంలో పెద్దెములు మండలం ఇందురు గ్రామానికి చెందిన జానిమియాకు ఇద్దరు భార్యలు రెండో భార్య కుమారుడు గోరెమియా (28) హైదరాబాద్ లోని ఓ కోళ్ల ఫామ్లో పని చేస్తున్నాడు.ఇతను మద్యానికి బానిస అయ్యాడు.జానిమియా కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి కోసం గొడవలు రావడంతో తండ్రి జానిమియా రెండో భార్య కుమారుడైన గోరెమియాపై కారతో దాడి చేశాడు.ఈ దాడిలో గోరెమియాకు తీవ్ర రక్తస్రవం కావడంతో అక్కడికకడే మృతి చెందడు.అయితే ఈ హత్యలో జానిమియాతో పట్టు మొదటి భార్య ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.సంఘటనపై కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.