మత్స్యకారులు అభివృద్ధి చెందాలి
తాండూర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో మత్స్యకారులు అభివృద్ధి చెందాలని ఉచిత చేప పిల్లల పంపిణీ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా కోటపల్లి చెరువులో తాండూర్ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు పదిలక్షల నలభై(10.4) వేల చేప పిల్లలను కోటపల్లి మత్స్యశాఖ ఆధ్వర్యంలో కోటపల్లి చెరువులో విడవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోటపల్లి మత్స్యశాఖ కమిటీ సభ్యులు,ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్,సర్పంచ్,విజయలక్ష్మి,మత్స్యశాఖ జిల్లా అధికారి చరిత రెడ్డి,ఉప సర్పంచ్ రియాజ్,కోటపల్లి గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి సుశీల్ కుమార్,యువజన నాయకులు దినేష్ కుమార్, బుగ్గాపురం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ నర్సింలు గౌడ్,లింగంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు అనంతరెడ్డి,వార్డు సభ్యులు,రమేష్ సహకార సంఘం సభ్యులు సాయిబ్రామ్, బిచ్చప్ప,మొగులప్ప,ఇక్బాల్,పీటర్,శ్రీనివాస్ గౌడ్,రమేష్ మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.