రైతుల భూములను లాకొంటున్న ప్రభుత్వం
తాండూర్ : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ఎన్ హెచ్ 167 బైపాస్ రోడ్డు పనులను తాండూర్ లో అధికారులు ముమ్మరంగా కొనసాగించనున్నారు.ఈ నేపధ్యంలో వికారాబాద్ జిల్లా పాత తాండూర్ కు చెందిన 77మంది భూమి పట్టాదారులు తమ భూములు నేషనల్ హైవే 167 రోడ్డుకు రైతుల భూములు కోల్పోవడo పట్ల భూమి పట్టా దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా రైతులు గురువారం పాత తాండూర్ లో సమావేశం నిర్వహించారు.అనంతరం పాత తాండూర్ కి చెందిన రైతులు మాట్లాడుతూ నేషనల్ హైవే 167 రోడ్డు రైతూలకు చెందిన పట్టా భూముల నుంచి రోడ్డు వెళుతుందని,దీంతో తాము తీవ్రంగా నష్ట పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని,రైతులకు న్యాయం చేయాలనీ విన్నవించారు.భూమి కోల్పోతున్న రైతులకు ప్రస్తుత మార్కెట్ విలువ కన్నా అధికంగా నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.లేకుంటే ఎన్ హెచ్ 167 బైపాస్ రోడ్డు పనులను అడ్డుకుంటామని పేర్కొన్నారు.ఈ సమావేశంలో పాత తాండూర్ రైతులు మనోహర్,మల్లేష్ యాదవ్,శ్రీకాంత్,బొప్పి శ్రీహరి,నీరటి హన్మప్ప,నీరటి కిష్టప్ప,అశోక్ రెడ్డి,నీరటి నర్సిములు,గోపాల్,చిదంబర్ రావు,అనంతయ్య,నీరటి అంజిలప్ప,నీరటి లక్ష్మప్ప తదితర రైతులు పాల్గొన్నారు.