Type Here to Get Search Results !

Sports Ad

విద్యార్థుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం A government that does not care about the problems of students

 

విద్యార్థుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం 

- ప్రభుత్వ ఇంటర్ కాలేజ్ గ్రౌండ్ ఆకతాయిలకు అడ్డా- 
- మారిన ఎలాంటి చర్యలు తీస్కొని అధికారులు
- విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంతటి పొరటనికైన సిద్దం
- ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మల్లికార్జున్ మాదిగ
- అధికారులు ప్రజా ప్రతినిదులు

తాండూర్ : గురువారం రోజున తాండూర్ ఇంటర్ కాలేజ్ సమస్యలపై ఎంఎస్ఎఫ్ నాయకులు సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మల్లికార్జున్ పాల్గొని మాట్లాడుతూ తాండూర్ ప్రభుత్వ ఇంటర్ కాలేజ్ ఏన్నో సంవత్సరాల చరిత్ర కలిగింది.ఎందరినో ప్రయోజకులను చేసిన చరిత్ర ఈ కాలేజీకి దక్కిందాన్నరు కానీ ప్రభుత్వం.అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు చాలా యిబ్బందులు పడుతున్నారు.నియోజవర్గంలోని నాలుగు మండలాల నుంచే కాకుండా కొడంగల్ కోస్గి లాంటి దూర ప్రాంతం నుంచి కూడా విద్యార్థులు వస్తుంటారు.కానీ నాణ్యమైన విద్య వసతులు క్లాస్ రూమ్ లు పాత భావనలు సరిపడని తరగతి గదులతో ముఖ్యంగా ఉపాద్యాయులు వున్న తరగతులు చెప్పక పోవడం ఇవేకాక  చదువు కునే స్థలాలు చాలా ప్రశాంత వాతావరణంలో వుండాలి కానీ ఇక్కడ మొత్తానికి విరుద్దం కాలేజీకి సంబంధం లేని ఆకతాయిలు నిత్యం కాలేజ్ గ్రౌండ్ లో ఆటలాడుతూ అరుపులు కేకలలు చేస్తూ ఎప్పుడు విద్యార్థులకు అబ్బందిని కలిగించిన అధికారులు ఏవ్వరు పట్టించుకోవడం లేదు.

వారం రోజుల క్రితం బయట నుంచి ఓచ్చిన ఓ ఆకతాయి ఇంటర్ రొండో సం" సదువుతున్న విద్యార్థినీ పై దురుసుగా ప్రవర్తించడాని సదరు కాలేజ్ ఉపాధ్యాయురాలు ఆ ఆకథియిని ప్రశ్నిస్తే ఆమెపై కూడా దాడికి యత్నించిన ఘటన తాండూర్ ఇంటర్ కాలేజ్ లో చోటు చేసుకుంది. కాబట్టి అధికారులు పోలీసులు ఈ ఇలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టలని లేని పక్షంలో విద్యార్థుల పక్షాన  ఎంఎస్ఎఫ్ ముందుండి పోరాడుతుంది అని  నాయకులు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ బషీరాబాద్ మండల ఇంఛార్జి ప్రవీణ్ కుమార్ మాదిగ ఎంఎస్ఎఫ్ తాండూర్ మండల ఇంఛార్జి వెంకటేష్ మాదిగ విద్యార్థులు భాను నగేశ్ సందీప్ శివ అజెయ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies