బషీరాబాద్ లో చేపలకు వెళ్లి శవమై కనిపించాడు
బషీరాబాద్ : చేపలు పట్టడానికి వెళ్లి శవమై కనిపించాడు ఈ ఘటన బషీరాబాద్ మండలం బాద్లపూర్ తండాలో చేటుచేసుకుంది.ఎస్ఐ విద్య చరణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రోజున రాత్రి సమయంలో బాద్లపూర్ తండా గ్రామానికి చెందిన మూడవత్ కీర్య నాయక్ తండ్రి పూర్య నాయక్ వయస్సు 60 సంవత్సరాలు.అతడు తన గ్రామ శివారులోని చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి తిరిగి తన ఇంటికి రాలేదు.అట్టి విషయంలో తన కుటుంబ సభ్యులు కీర్యా నాయక సంబంధించి ఎంత వెతికినా ఎలాంటి సమాచారం లభించకపోయేసరికి నిన్న అనగా తేదీ: 01.12.2022 గురువారం రోజు బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నందు కిర్యా నాయక్ భార్య అయిన నిలిభాయి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనది.
శుక్రవారం రోజు ఉదయం అందాజా 07:00 గంటల సమయంలో కీర్య నాయక్ అన్న అయినా నర్సింగ్ బాద్లపూర్ గ్రామ శివారులోని చెరువు పరిసర ప్రాంతాల్లో వెతుకుచుండగా ఒక మృతదేహం చెరువులో కనిపించగా అట్టి సమాచారం మాకు ఫోన్ ద్వారా తెలియగ వెంటనే మేము చెరువు వద్దకు వెళ్లి చూడగా అట్టి మృతదేహం కీర్య నాయక్ మృతదేహంగా గుర్తించబడింది.తదుపరి శవపరీక్ష నిర్వహించి అనంతరం మృతుడి మృతదేహంను దహన సంస్కారాల నిమిత్తం తన రక్తసంబందికులకు అప్పగించనైనది అని తెలిపారు.