Type Here to Get Search Results !

Sports Ad

యేసు అడుగులో మనం నడిస్తే యుద్దాలు ఉండవ్ If we follow in the footsteps of Jesus, there will be no wars

 

యేసు అడుగులో మనం నడిస్తే యుద్దాలు ఉండవ్

- స్వరాష్ట్రంలో మతసామరస్యానికి మొదటి ప్రాధాన్యత
- క్రీస్తు బోధ మనసుకు శాంతిని కలిగించేది 
- ప్రజల కోసమే క్రీస్తు పుట్టాడు 
- ఎమ్యెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు

తాండూర్ : శుక్రవారం నాడు తాండూర్ కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణలో నిర్వహించిన ఐక్య క్రిస్మస్ ఆధ్వర్యంలో క్రైస్తవ సోదరసోదరిమణులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న క్రిస్మస్ కానుకలను పంపిణీ చేసిన మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు,ఎమ్యెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేదలు పండుగ సంబురంగా చేసుకోవాలనే ఉద్దేశ్యంతో అన్ని మతాల పండుగలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ గారు బట్టల పంపిణీ చేపడుతున్నారు.క్రిస్మస్ పండుగను క్రైస్తవులు సంతోషంగా జరుపుకుని ఆ యేసుక్రీస్తూ ఆశీర్వాదం పొందాలని కోరారు.క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం క్రిస్టియన్లకు కానుకలు పంపిణి చేస్తుందన్నారు.అన్ని మతాలను గౌరవించే పరమత సహనం మనకు ఉండాలని క్రీస్తు పుట్టినరోజు అయిన క్రిస్మస్ సందర్బంగా ఆ ప్రభువు దీవెనలు అందరిపై ఉండాలని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవ సోదరుల సంక్షేమానికి కృషి చేస్తుందని యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంతో పవిత్రంగా భావించే క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాలతో,భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ క్రైస్తవ సోదర,సోదరీమణులందరికీ ముందస్తు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమాలలో ఎంపిటిసిలు,జెడ్పిటిసిలు,పలు పాస్టర్లు,క్రైస్థవులు తదితరులు పాల్కొన్నారు.

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. మనిషి కి మంచి నడవడిక అనేది ఇతరుల మతా లను గౌరవం చూపడం లో ఉంటుంది క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు.gundamma

    ReplyDelete

Top Post Ad

Below Post Ad

Hollywood Movies