మంతన్ గౌడ్ తాండలో అక్రమంగా ఇసుక రవాణా
బషీరాబాద్ : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో శుక్రవారం రోజున అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా పట్టుబడ్డ ట్రాక్టర్. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారు జామున ఉదయం 02:00 గంటల సమయంలో మంతన్ గౌడ్ తాండ శివారులో ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ నెం.TS 34 TB 0388 మరియు ట్రాలీ నెంబర్ TS 34 TB 1510 ను స్వాధీనం చేస్కుని ట్రాక్టర్ డ్రైవర్ మరియు బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్ తాండ గ్రామనికి చెందిన ఓనర్ అయిన రాథోడ్ కిషన్ తండ్రి మాణిక్ నాయక్ వయస్సు 32 వత్సరాలు.వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగింది.అక్రమంగా ఇసుక రవాణా చేస్తే ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోబడును అని తెలిపారు.