బదిలీపై వెళ్తున్న ఎలక్ట్రికల్ డిఈని సత్కరించిన అంబేద్కర్ సంక్షేమ సంఘం
- ప్రముఖ అంబేద్కర్ వాది శ్రీ పెరుమాళ్ళ పెళ్లి విజయ్ ను సత్కరించి
- అభినందించిన భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం
- వృత్తిలో అంకితభావాన్ని ప్రవృత్తిలో అంబేద్కర్ వాదాన్ని కలగలిపి మూర్తిభవించిన సేవా తత్వరుడు
- శ్రీ పెరుమాళ్ళపల్లి విజయ్ అభినందనీయుడు
- ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్
కొత్తగూడెం : బాల్యం నుండే అంబేద్కర్ వాదాన్ని అలవర్చుకొని అంకితభావం కృషి దీక్ష దక్షతలు కటోర పరిశ్రమ త్యాగ నిరతి తో కష్టపడి చదివి ఎలక్ట్రికల్ డి ఈ గా ఉన్నత స్థానాన్ని అధిరోహించి అటువృత్తిపరంగా ఇటు ప్రవృత్తి పరంగా న్యాయం చేస్తూ మంచితనం మానవత్వం కలగలిసి మానవ సంబంధాలను అత్యున్నతంగా ప్రేమించే నిరంతర సేవా తత్పరుడు.బలమైన అంబేద్కర్ వాది కొత్తగూడెం రీజియన్ ఎలక్ట్రికల్ డిఈ శ్రీ పెరుమాళ్ళ పల్లి విజయ్ యొక్క సేవలు ప్రశంసనీయమని అభినందనీయమని భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కవి సినీ గీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ప్రముఖ అంబేద్కర్ వాది ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు.సుదీర్ఘమైన నాలుగున్నర సంవత్సరాల విశిష్టమైన సేవలు అందించి ఇక్కడి నుండి మహబూబాబాద్ కు బదిలీ అయి వెళ్తున్న ఎలక్ట్రికల్ డి ఈ శ్రీ విజయ్ ను గురువారం రోజున సాయంత్రం బస్టాండ్ వద్ద గల సంఘ కార్యాలయంలో ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ నేతృత్వంలో పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరిం చి అభినందించారు.
ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల మాట్లాడుతూ ఉన్నతమైన హుందాతనం గల వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న శ్రీ విజయ్ వృత్తి పరంగా సంస్థ ప్రయోజనాలను కాపాడుతూ అటు వినియోగదారుల సంక్షేమాన్ని కూడా గమనంలోకి తీసుకొని వారిలో విద్యుత్ పొదుపును విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవలసిన చర్యలను ఎన్నోసార్లు అవగాహన కార్యక్రమాల ద్వారా విద్యుత్ వినియోగదారులకు అవగాహన కల్పించి అప్రమత్తం చేసినారని,అటు ప్రముఖ అంబేద్కర్ వాదిగా సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదివే ఎందరో విద్యార్థులకు ఆర్థికమైన చేయూతనందించి వారి ఎదుగుదలకు తోడ్పడుతున్నారని సమాజంలోని ఇంకా ఎందరో అభాగ్యులు ఆదుకుంటున్నారని శ్రీ విజయ్ మన తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని వారు భవిష్యత్తులో ఇంకా అత్యున్నత స్థానాలను అధిరోహించి సామాజిక హితానికి ఉపయోగపడుతూ సమ సమాజ స్థాపనలో భాగస్వామి కావాలని డాక్టర్ మద్దెల అభివర్ణించారు.
ఈ ఆత్మీయ సత్కారానికి స్పందించిన శ్రీ విజయ్ మాట్లాడుతూ కొత్తగూడెంలోని ఆత్మీయులు చూపిన ప్రేమ తానే ప్పటికీ మర్చిపోను అని ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ గారు లాంటి గొప్ప వ్యక్తులను పరిచయం చేసి ఇక్కడ వృత్తిపరమైన సంతృప్తిని ప్రవృత్తి పరమైన గొప్ప అనుభూతులను మిగిల్చిన కొత్తగూడెంనకు భవిష్యత్తులో తప్పకుండా తిరిగి వస్తానని హర్షద్వానాల మధ్య ప్రకటించారు.ఈ ఆత్మీయ అభినందన కార్యక్రమంలో సన్మాన గ్రహీత శ్రీ విజయ్ తో పాటు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ సంఘ నాయకులు అపరబాలు అల్లి శంకర్ సినీ నటులు తాండూర్ ధనరాజ్ చిరంజీవి సేవ సమితి రాష్ట్ర కార్యదర్శి బి విల్సన్ బాబు అభ్యుదయవాది సింగరేణి ఉద్యోగి మామిడి సంజయ్ గిరిజన నాయకులు రత్న నరేందర్ సీనియర్ అకౌంటెంట్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.