Type Here to Get Search Results !

Sports Ad

మీ కాలేయాన్ని ఇలా ఆరోగ్యంగా ఉంచుకోండి Keep your liver healthy

 


మీ కాలేయాన్ని ఇలా ఆరోగ్యంగా ఉంచుకోండి

ఆరోగ్యం : మ‌న శరీరంలో జ‌రిగే జీవ‌క్రియ‌ల్లో ముఖ్య పాత్ర పోషించేది కాలేయం. శ‌రీరంలో అతిపెద్ద అవ‌య‌వం కూడా కాలేయ‌మే.అలాగే జీవితాంతం పెరిగే ఒకే ఒక అవ‌య‌వం కూడా కాలేయమే.మనం తీసుకునే ఆహారాల్లోగానీ, ఔషధాల్లోగానీ ఉండే విషపదార్థాలను తనలో దాచుకుని, శరీరానికి హాని జరగకుండా కాలేయం కాపాడుతుంది.ఇంతటి ప్రాధాన్యమున్న కాలేయానికి ఏ చిన్న డ్యామేజ్ జరిగినా అనేక రకాలైన అరోగ్య సమస్యలు తలెత్తుతాయి.ఎలాంటి సంకేతాలు లేకుండానే లివర్ డ్యామేజ్ అవుతుంటుంది. కలుషితమైన నీరు తాగడం, ఆహారం తినడం, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. 


పొత్తికడుపు పైన కుడివైపు మూలన, లేదా పక్కటెముకకు కింద కుడి భాగంలో నొప్పి ఉంటే అది కాలేయం దెబ్బతిన్న లక్షణంగా భావించాలి.మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడం ద‌గ్గర్నుంచి కొవ్వు, చక్కెర, ప్రొటీన్ శాతాన్ని నియంత్రించడం, రక్తశుద్ధి చేయడం, జీర్ణప్రక్రియకు దోహదపడే బైల్ ద్రవాన్ని ఉత్పత్తి చేయడం, విటమిన్లు, ఐరన్ వంటి పోషకాలను నిల్వ చేయడం, ఆహారాన్ని శక్తి రూపంలోకి మార్చడం, శరీరంలోని వివిధ హార్మోన్ల విడుదలను నియంత్రించడం,రక్తం గడ్డకట్టడానికీ,గాయాలు తొందరగా మానడానికి కావాల్సిన ఎంజైమ్స్‌లను ఉత్పత్తి చేయడం.. ఇలా ఎన్నో కీలకమైన బాధ్యతలను కాలేయం నిర్వహిస్తుంది.




90 శాతం కాలేయం దెబ్బతిన్నా ఒక పట్టాన వ్యాధి లక్షణాలు బయట ప‌డ‌వు.లివర్ డ్యామేజ్ అవ్వడం వల్ల కణజాలాల్లో ఫైబ్రయోస్ స్కార్స్ వల్ల కాళ్లల్లో వాపులు వచ్చి లివర్ ఫైబ్రోసిస్ వస్తుంది.చర్మంలో పసుపు పచ్చవర్ణంలో, కళ్ళు లేతపసుపు రంగులోకి మారినట్లైతే జాండీస్‌గా గుర్తించాలి.


ఎలా కాపాడుకోవాలి..?
* రోడ్డు పక్కన విక్రయించే తినుబండారాలు,గప్‌చుప్‌లు,టీ,కాఫీ,బిస్కెట్లు,ఐస్‌క్రీమ్‌లు,బేకరీ ఫుడ్‌, బర్గర్లు,పిజ్జాలు,మాంసం ఎడాపెడా లాగించేయ‌డం వ‌ల్ల కాలేయం దెబ్బతింటుంది.
* వీలైనంత వరకు మందులను తక్కువగా వాడాలి.అదీకూడా వైద్యుల సలహా మేరకు మాత్రమే మందులు తీసుకోవాలి.
* నాణ్యత కలిగిన నూనెలను మాత్రమే వంటలకు వాడాలి. ఒకసారి వాడిన నూనెలను పదేపదే వాడితే కూడా లివర్‌ చెడిపోయే ప్రమాదం ఉన్నది.
* మద్యం సేవించడం వల్ల కాలేయం చెడిపోతుంది.కాబట్టి వీలైనంత వరకు మద్యం తీసుకోవడం మానుకోవడం బెటర్‌.
* ఆహారాన్ని సరిగ్గా ఉడికించకుండా తీసుకోకూడదు.అలా ఉడకని ఆహారం తీసుకుంటే లివర్‌ కు  వపనిభారం పెరుగుతుంది.
* రాత్రి వేళ త్వరగా పడుకోవడం, ఉదయాన్నే నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి.
* నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకోవాలి. లేదంటే లివర్‌లో వ్యర్థాలు పెరిగిపోతాయి.


* ఉదయాన తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాలి.
* అతిగా ఆహారం తీసుకోవద్దు.అతిగా తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసేందుకు లివర్‌పై ఒత్తిడి పెరిగి చెడిపోయేందుకు ఆస్కారం ఉంటుంది.
* కాలేయం ఆరోగ్యం కోసం నిత్యం వెల్లుల్లి, బీట్‌రూట్, కాలిఫ్లవర్‌,బ్రకోలి,క్యారెట్‌,బంగాళదుంపలు, యాపిల్స్‌తోపాటు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆహారంలో భాగం చేసుకోవాలి.
* కాలేయం అభివృద్ధికి ఉప‌యోగ‌ప‌డే ఫైబర్,పొటాషియం,ఫ్లెవనాయిడ్స్,ఫైటోన్యూట్రీషీయన్స్ ల‌భించే ఉల్లిని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలి. ద్రాక్షపండ్లను ఎక్కువగా తినాలి.
* ప్రతిరోజు ఒక గ్లాసు నీళ్ళతో నిమ్మరసం కలిపి ఉదయం పరగడుపునే త్రాగాలి.
* బ‌రువును కంట్రోల్ పెట్టుకొంటూ నిత్యం వ్యాయామం చేయ‌డం ద్వారా కాలేయాన్ని కాపాడుకోవ‌చ్చు.
* కాలేయం ఆరోగ్యానికి హెప‌టైటిస్ బీ వ్యాక్సీన్‌ తీసుకోవడం చాలా ఉత్తమం.


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies