రెండు హత్యలు చేసింది ఒక్కడే
- రెండు మిస్సింగ్ మర్డర్ కేసులో నిందితులు ఒక్కడే
- చాలా రోజుల తర్వాత కేసును సేదించిన పోలీసులు
క్రైమ్ న్యూస్: వికారాబాద్ టౌన్ గురువారం రోజునఎస్ఐ శ్రీ సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి వికారాబాద్ టౌన్ ఓ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా 08:00 గంటలకు వికారాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక వ్యక్తి చేతిలో కవర్ పట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ గారు అక్కడికి పోయి అతన్ని పట్టుకొని తనిఖీ చేయగా అతని దగ్గర నిషేధిత గంజాయి ఉన్నందున చట్ట ప్రకారం అతన్ని విచారించగా అతని పేరు ఎండి.సల్మాన్ తండ్రి ముజీబ్ వయసు 24 సం లు, యెన్నెపల్లి వికారాబాద్ అని తెలిపినాడు,అతని దగ్గరున్న గంజాయిని,స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా అతడ్ని విచారించగా.
2019 డిసెంబర్ నెలలో కల్యాణ్ బాబు అనే అతన్ని సల్మాన్ తన ప్రియురాలితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు కల్యాణ్ బాబును చంపాలన్న ఉద్దేశంతో పథకం ప్రకారం వికారాబాద్ కు తీసుకువచ్చి శివారెడ్డిపేట్ శివారులో గల ఒక బావి దగ్గర ఇద్దరు కలిసి గంజాయి మరియు మద్యం సేవించిన తరువాత కల్యాణ్ బాబు తాగిన మైకంలో ఉండగా, అతన్ని చంపాలన్న ఉద్దేశంతో కల్యాణ్ బాబును బాయిలో తోసివేసి చంపినాడని నేరం అంగీకరించినాడు.అప్పుడు వికారాబాద్ పోలీసువారు కల్యాణ్ బాబు యొక్క శవాన్ని బావిలో గుర్తించి యెలాంటి ఆధారాలు లేనందున గుర్తు తెలియని శవముగా భావించి కేసు న0.371/2019 U/s 174 CrPC ప్రకారం కేసు నమోదు చేయనైనది.
కల్యాణ్ బాబు ను చంపిన కేసు విషయంలో తప్పించుకొని తిరిగే క్రమంలో కొన్ని రోజుల పాటు హైదరాబాదులో ఉండి,మళ్ళీ వికారాబాద్ కు వచ్చి గంజాయి వ్యాపారం చేసే క్రమంలో 2021 సం.,లో సురేశ్ అనే అతను సల్మాన్ కు తన సొంతూరు నేపాల్ నుండి గంజాయి తెప్పించి ఇస్తానని.ఇవ్వకపోవడంతో గంజాయి వ్యాపారం విషయంలో సల్మాన్ ను మోసం చేసినందుకు ఇద్దరి మధ్య గొడవ జరిగి సురేశ్ సల్మాన్ ని కొట్టినందున నిందితుడు సల్మాన్ సురేశ్ ను చంపాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం ముందుగానే సల్మాన్ మరియు సురేశ్ అప్పుడప్పుడు కలిసి గాంజా మధ్యం సేవించేప్రదేశమైన మద్దులగడ్డ తండా ప్రక్కన గల ఒక చిన్న గుట్ట పైన ఒక ఇనుప పైపు ను దాచిఉంచి అవకాశమున్న ఒకరోజు ఏప్రిల్ నెల 2021 సం లో సురేశ్ ను ఆ మద్దులగడ్డ తండా దగ్గరున్న గుట్టకు తీసుకెళ్లి ఇద్దరు కలిసి గాంజ మద్యం సేవించిన తరవాత సల్మాన్ కావాలనే సురేశ్ తో గొడవపడి, సురేశ్ మద్యం మత్తులో ఉండగా తాను ముందుగా దాచి ఉంచిన ఇనుప పైపుతో అతని తలపై బలంగా కొట్టి చంపినాడు. అయితే సురేశ్ వాళ్ళ సొంత చిరునామా నేపాల్ కావున చాలా యేళ్ళ క్రితం వికారాబాద్ వచ్చి అతను ఇక్కడే స్థిరపడి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లలో మాస్టర్ గా పనిచేసుకుంటూ గాంజ అమ్ముతు ఉండేవాడని తెలిసింది.
కల్యాణ్ బాబు ను మరియు సురేశ్ ను చంపిన తరువాత తప్పించుకొని తిరిగే క్రమంలో కొన్ని రోజుల పాటు హైదరాబాదులో ని బేగంపేట లో ఉన్నపుడు కొన్ని రోజుల పాటు ఉంటూ చికెన్ సెంటర్ లో పనిచేసే క్రమంలో అక్కడ ఒక అమ్మాయిని వెంబడించి వేధించిన విషయం లో అతడిపై కేసు నమోదు కాగా అక్కడి నుండి కూడా తప్పించుకొని వివిధ ప్రదేశాల్లో తిరుగుతూ గంజాయి అమ్ముతు ఈ రోజు వికారాబాద్ లో పట్టుబడగా వికారాబాద్ పోలీసువారు విచారించగ తాను చేసిన రెండు హత్య కేసులను మరియు బేగంపేటలో తనపై ఉన్న కేసును ఒప్పుకోవడం జరిగిందాని పోలీసులు తెలిపారు.