Type Here to Get Search Results !

Sports Ad

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలి SC classification bill should be passed into law

 

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలి

- కోళ్ళ శివ మాదిగ ఎంఆర్పిఎస్  జాతీయ ప్రధాన కార్యదర్శి
- శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో
- బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం

వికారాబాద్ : ప్రస్తుతం జరిగే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనూ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా బషీరాబాద్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ళ శివ మాదిగ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే షెడ్యూలు కులాల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తామని ఇచ్చిన హామీని 8 సంవత్సరాలు గడుస్తున్న నెరవేర్చకపోవడం దుర్మార్గమైన విషయంగా ఎమ్మార్పీఎస్ పేర్కొంటుంది. 

షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకపోవడం మూలంగా మాదిగ మాదిగ ఉప కులాలు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొన్న దేశంలో ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యవాదులు వ్యతిరేకిస్తున్న ఎన్నో రకాల బిల్లులను నిర్బంధంగా ఆమోదించుకుంటున్న బిజెపి ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ బిల్లుకు సానుకూలత ఉన్న చట్టబద్ధత కల్పించకపోవడంలో ఉన్న వివక్షత ఏంటో తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాం.చట్టసభల సాక్షిగా పార్టీ మేనిఫెస్టోలో సాక్షిగా షెడ్యూల్ కులాల వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్న బిజెపి అధినాయకత్వం వెనకడుగు వేయడానికి ఎందుకు ప్రయత్నిస్తుందో వివరించాలని డిమాండ్ చేస్తున్నాం.

దేశంలోని మెజార్టీ పార్టీల ఏకాభిప్రాయం ఉన్నటువంటి వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించే విషయంలో బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రాజకీయంగా రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరిస్తున్నాం మాదిగలకు బిజెపి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బి.కృష్ణ మాదిగ  ప్రకాష్ మాదిగ,రాములుమాదిగ నర్సింహమాదిగ.శివ శరణ్ మాదిగ మాదిగ,రవిమాదిగ చంద్రం,శేకర్ మాదిగ,సురేష్ మాదిగ,బాలరాజ్ మాదిగ. పరిగి నియోజక వర్గ ఇంఛార్జి రమేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies