పారదర్శకంగా జడ్పి నిధుల కేటాయింపు సునీతారెడ్డి
వికారాబాద్ : జిల్లా పరిషత్ నిధుల్లో అన్ని మండలాలకు పారదర్శకంగా నిధుల కేటాయింపు జరిగిందని జడ్పి చైర్ పర్సన్ సునీతారెడ్డి గారు స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన జడ్పి సమావేశంలో మంత్రి సబితారెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సంధర్బంగా ఒకరిద్దరు సభ్యులు చేసిన ఆరోపణలపై సమాధానం ఇచ్చారు.ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ నుంచి రెండోసారి చైర్ పర్సన్ గా ఉన్నప్పుడు వికారాబాద్ జిల్లాకు అధిక నిధులు కేటాయించమన్నారు.ఈ సారి కూడా వికారాబాద్ జిల్లాలో వెనకబడిన మండలాలకు కొంత ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించిన మాట వాస్తవమన్నారు.తనకు జడ్పిటీసీలు అందరూ సమానమేనని చెప్పారు.జిల్లా అభివృద్ధిలో జడ్పి కీలక బాధ్యత పోషిస్తుందని అన్నారు.అంతకు ముందు మంత్రి గారితో కలిసి హెల్త్ కిట్లను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గౌరవ వికారాబాద్,పరిగి, చేవెళ్ల ఎమ్మెల్యేలు,గౌరవ డీసీసీబీ,డీసీఎంఎస్ చైర్మన్ లు,గౌరవ జడ్పిటీలు,గౌరవ ఎంపీపీలు,జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పేదలకు ఆసరా సిఎంఆర్యాప్ చెక్కులు
తాండూర్ : తాండూర్ పట్టణనీకి చెందిన దత్తురావు గారికి 2,00,000 చెక్కు అందించిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.యలల్ మండలానికి చెందిన జనార్ధన్ రెడ్డి గారికి రూ.60,000/-,బషీరాబాద్ మండలానికి చెందిన వెంకటేశ్వర్ గారికి రూ.60,000/- రూపాయల,సీఎంఆర్యాప్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేయడం జరిగింది.అనంతరం యాలల్ మండల మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ కుమారుని వివాహానికి ఈ నెల 09-12-2022 నాడు హాజరుకావాలని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారికి ఆహ్వానం పత్రిక అందజేశారు.ఈ కార్యక్రమంలో తాండూర్ పిఎసిఎస్ చైర్మెన్ రవి గౌడ్, పిఎసిఎస్ చైర్మెన్ రవి గౌడ్,పిఎసిఎస్ చైర్మెన్ సురేందర్ రెడ్డి,మాజీ జడ్పీటిసి సిద్రల శ్రీనివాస్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్,మాజీ సర్పంచ్ ఉద్ధండపూర్ కేశవ్ రావు,శ్రీనివాస్ గౌడ్,అశోక్ ముదిరాజ్ మాంతన్ గౌడ్,హరిశ్వర్ రెడ్డి,తదితరులు మండల నాయకులు మరియు లబ్దిదారులు పాల్గొన్నారు.