Type Here to Get Search Results !

Sports Ad

తాండూరుకి మళ్ళీ ఎమ్మెల్యేగా పైలట్ Tandoori pilot is again MLA


 తాండూరుకి మళ్ళీ ఎమ్మెల్యేగా పైలట్

- పైలట్ రోహిత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూడలేక పోతున్నారా?
- తాండూరు క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్
- ఒక మైనారిటీ కి ఛైర్పర్సన్ గా చేయలేకపోయినారు
- ఛైర్మెన్ పదవికి మాట ఇచ్చి తప్పిన మీరు కాదా?
- 40 ఏండ్లుగా అభివృద్ధి లేని ప్రాంతంలో అభివృద్ధి
- మీరు తాండూరుకి ఏమి చేయలేక

తాండూర్ : సోమవారం రోజున ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో తాండూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి పి.వెంకట్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులతో ప్రెస్ మీట్ నిర్వహించారు.ఆదివారం రోజున జరిగిన పెద్దముల్ మండలంలో ఎమ్మెల్సీ గారి చెప్పినటువంటి టికెట్ నాదే,నేనే సిట్టింగ్ ఉంటా అనే మాటలకు జవాబుగా.ఈ రోజు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో నాయకులు మాట్లాడుతూ మీరు తాండూరుకి ఏమి చేయలేక,ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూడలేక పోతున్నారా? అని ప్రశ్నించారు.

గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారు స్వయంగా సిట్టింగ్ లకే ఎమ్మెల్యే టికెట్లు అని చెప్పడం మర్చిపోయారేమో అని గుర్తు చేశారు.ఇలాంటి మాటల వల్ల కార్యకర్తలకు మరియు పార్టీకి తీరని నష్టం చేసిన వారు అవుతారని చెప్పారు.దశాబ్దాలుగా నోచుకోని అభివృద్ధి పనులని మన గౌరవ ఎమ్మెల్యే గారు చేసి చూపిస్తున్నారని గుర్తు చేశారు.అలాగే రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారి నాయకత్వాన్ని బలపరిచే దిశగా తాండూర్ నియోజకవర్గ ప్రజానీకం సిద్ధంగా ఉందని చెప్పారు.కచ్చితంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే దిశగా తాండూరు బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు యువ నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

మీయొక్క ఆదిపత్యం కోల్పోతున్నారని ఇలాంటి మాటలు ఆడడం మంచిది కాదదన్నారు.తాండూరు ప్రజలు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ గారితో ఉన్నారు, ఆయన చేస్తున్న అభివృద్ధి పనులు అందరూ చూస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మళ్ళీ పైలట్ రోహిత్ రెడ్డి గారు రావాలని తాండూరు ప్రజలు కోరుతున్నారు.ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎమ్మెల్యే గా పైలట్ రోహిత్ రెడ్డి గారు గెలుస్తారు.40 ఏండ్లుగా అభివృద్ధి లేని ప్రాంతంలో అభివృద్ధి చేస్తునారు. ఈ కార్యక్రమాలలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ మరియు పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్పు,టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింలు,శ్రీనివాస్ చారి గారు, ఇర్ఫాన్,జిలాని,ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్,ఉర్దూ ఘర్ చైర్మన్ రజాక్,పోట్లీ మహారాజ్ దేవాలయ చైర్మన్ రాజన్ గౌడ్,పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు హనుమంతు, తాండూర్ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ రమేష్ టైలర్,అలాగే యువ నాయకులు ఇంతియాజ్ పటేల్,రజక నర్సింలు పాల్కొన్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies